Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మూడు కోట్ల బంగ్లా అలా వదిలేస్తే ఎలా?

మూడు కోట్ల బంగ్లా అలా వదిలేస్తే ఎలా?

భాగమతి సినిమా కథ సంగతి మాట్లాడడం లేదు. కథనం గురించి మాట్లాడం లేదు. ఆర్ట్ డైరక్టర్ రవీందర్ యువి వాళ్ల చేత మూడు కోట్లు ఖర్చు చేయించి తయారు చేయించిన బంగ్లా సెట్ గురించి కూడా మాట్లాడడం లేదు.

అరుంధతి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి, యువికి అదే తేడా. ఆయన బనగాన పల్లె దగ్గర పాత కోటను తీసుకుని, దాన్ని గ్రాఫిక్స్ లోకి మార్చి, మిగిలినదంతా సిజిలో కానిచ్చేసారు.

భాగమతికి కూడా సిజి వర్క్ బోలెడు చేసారు. అయినా భవంతి సెట్ కోసం మూడు కోట్లు ఖర్చు చేసారు. కానీ భవంతిని ప్రచారానికి వాడుకోలేకపోయారు. భవంతి ఫస్ట్ లుక్ ఇద్దాం అనుకున్నారు.

దాన్ని ఇంత చేద్దాం అంత చేద్దాం అనుకున్నారు. కానీ ఏమీ చేయకుండానే సినిమా విడుదలకు సిద్దమైపోయింది. మరి భవంతి సెట్ కోసం అంత ఖర్చు చేసి ప్రచారానికి వాడుకోకుండా సాధించినదేముంది?

పైగా సినిమాకు రావాల్సినంత బజ్ ఇంకా రాలేదు. విడుదలకు రెండు రోజులే టైమ్ వుంది. అదృష్టం కొద్దీ సోలో రిలీజ్ దొరికింది. సో ఓపెనింగ్స్ సమస్య లేదు. కానీ సినిమా బాగుంటేనే ముందుకు వెళ్తుంది.

ఓపెనింగ్స్ ను ఫస్ట్ వీకెండ్ స్టడీ కలెక్షన్స్ గా మార్చుకోవాలంటే మరింత బలమైన ప్రచారం కావాలి. అనుష్క, బంగ్లా తప్ప, భాగమతికి మరో ప్లస్ లేదు. అనుష్క గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? ఇంక చెప్పాల్సింది బంగ్లా విశేషాలే. దాన్ని కూడా సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు యువి జనాలు.

భాగమతి సెట్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?