Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మొత్తానికి జవాన్ బయటకు వస్తున్నాడు

మొత్తానికి జవాన్ బయటకు వస్తున్నాడు

ముందే చెప్పినట్లుగా, జవాన్ వాయిదా పక్కాఅయింది. నవంబర్ 3కు రావడంలేదు. డిసెంబర్ 1 విడుదల డేట్ గా ప్రకటించారు. ఈ సినిమా మీద ఎందుకో పెద్దగా పాజిటివ్ బజ్ లేదు. సాయిధరమ్ తేజ ఫ్లాపుల ఖాతాలో ఇది మరోటి అవుతుందని ఇప్పటి నుంచే గుసగుసలు ప్రారంభమైపోయాయి ఇండస్ట్రీలో. దీనికి తోడు ఎప్పుడైతే ఇది వాయిదాల మీదా వాయిదాలు పడుతోందో, ఎప్పుడైతే, థమన్ చెప్పాడని, దిల్ రాజు రిపేర్లు చేస్తారని వార్తలు బయటకు పోక్కాయో అప్పటి నుంచి ఇక పూర్తగా హోప్స్ తగ్గిపోయాయి.

అదృష్టం బాగుండి హిట్ అయితే ఓకె. లేదూ అంటే సాయిధరమ్ తేజకు కష్టమే. ఇది కాక రెండు సినిమాలు వున్నాయి, వాటిలో ఒకటి వచ్చే ఏడాది ప్రారంభమై, ఫినిష్ కావాలి. అంటే చాలా టైమ్ పడుతుంది. వినాయక్ సినిమా ఒక్కటే హోప్. దానికి కూడా కామన్ ఆడియన్స్ కు అందనంత ఎత్తున టైటిల్ ఫిక్స్ చేసారు. 'ఇంటిలిజెంట్' అంటూ. నాని, శర్వా, నిఖిల్, రాజ్ తరుణ్ లాంటి వాళ్ల బాటలోకి సాయిధరమ్ ఎప్పుడు వస్తాడో? ఎప్పుడు సరైన సినిమాలు చేస్తాడో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?