Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ముఫై రోజులు కాకుండానే...

ముఫై రోజులు కాకుండానే...

రాను రాను అమెజాన్ వ్యవహారం మారుతోంది. సినిమాలకు డిజిటల్ రైట్స్ కోసం కోట్లు చెల్లిస్తూ, మరోపక్క సినిమాలు తన ప్రైమ్ సైట్ లో వుంచడంతో అగ్రిమెంట్ ప్రకారం నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. దిల్ రాజు నిర్మించిన నాని-సాయిపల్లవి కాంబినేషన్ సినిమా ఎంసిఎ ను సరిగ్గా 28రోజులకే అప్ లోడ్ చేసేసింది.

నిజానికి ఎంసిఎ సినిమా ఈ సంక్రాంతి సీజన్ లో కొత్తగా విడుదలయిన సినిమాలతో పోటీపడుతూ ఆడుతోంది. చాలా థియేటర్లలో సంక్రాంతి సీజన్ లో హవుస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. ఇలాంటి టైమ్ లో అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది.

మంచి రేట్లకు అమ్మడం వల్ల ఎంసిఎ వల్ల బయ్యర్లు బ్రేక్ ఈవెన్ అయి, లాభాల బాట పట్టడానికి కాస్త టైమ్ పట్టింది. లాభాలు వస్తున్నాయి, ఇంకా వస్తాయి అనుకున్న టైమ్ అమెజాన్ లోకి వచ్చేసింది. బి సి సెంటర్లలో అమెజాన్ ప్రయిమ్ అంత పాపులర్ కాదని వాదిస్తే వాదించవచ్చు.

కానీ ఈ పరిణామాలు ఇలా కొనసాగితే టాలీవుడ్ కు కాస్త కష్టమే అవుతుంది. చానెళ్ల వాళ్లు రైట్స్ కొని, ఇన్ని రోజుల తరువాత వేస్తాం అని అగ్రిమెంట్ చేసుకున్నా, అలా వేయడంలో కాస్త పట్టు విడుపు వుంటుంది. కానీ అమెజాన్ అలాకాదు. టైమ్ అంటే టైమ్.

దీనివల్ల భవిష్యత్ లో జనాలకు ఓ భరోసా వచ్చేస్తుంది. ఫలానా టైమ్ కు అమెజాన్ లో వచ్చేస్తుంది అని. దాని వల్ల టికెట్ ఖర్చు భరించలేని ఆడియన్స్ థియేటర్ కు దూరమయ్యే ప్రమాదం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?