Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగచైతన్య ‘సవ్యసాచి’

నాగచైతన్య ‘సవ్యసాచి’

సినిమా గురించి జనాలు మాట్లాడుకోవాలన్నా, సినిమాకు బజ్ రావాలన్నా ముందు టైటిల్ అన్నది కీలకం. సరైన టైటిల్ దొరికితే ముందుగానే ప్రకటించేస్తే వచ్చే ఆసక్తి వేరుగా వుంటుంది. లేదూ పెద్ద హీరోల ప్రాజెక్టులు అంటే టైటిల్ ప్రకటించే వరకు ఆసక్తి అలాగే వుంటుంది. నాగ్ చైతన్య లాంటి మీడియం రేంజ్ హీరోల సినిమాలకు టైటిల్ ముందుగా ప్రకటించేస్తేనే మేలు. ఇప్పుడు అదే చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు.

ఇప్పటి దాకా ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్ తో సిన్మాలు చేసిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు నాగ్ చైతన్యతో సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాకు సవ్యసాచి అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సవ్య సాచి అంటే రెండు చేతులతోనూ అస్త్రాలు ప్రయోగించగలిగిన వాడు అని అర్థం. అందుకు తగినట్లే ఫస్ట్ లుక్ పోస్టర్ వుంటుందని తెలుస్తోంది. పోస్టర్ కూడా నాగ్ చైతన్యను కొత్తగా చూపించబోతున్నారని క్లియర్ చేస్తుందని తెలుస్తోంది.

ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఈ రోజు ఉదయం ప్రకటిస్తున్నారు. మంచి రోజులు దాటకుండా టైటిల్, ఫస్ట్ లుక్ ప్రకటించేసి, మరి కొద్ది రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. చాలా కీలకమైన పాయింట్ తో దర్శకుడు చందు మొండేటి కథ తయారు చేసారట. కథ ఎంత కీలకమో, కథలో కీలకమైన పాయింట్ ఏమిటో, టైటిల్ లోగో లోనే వివరిస్తారని తెలుస్తోంది.

టైటిల్ లోగోలోని ఓ అక్షరంలోనే సినిమాలో కీలక విషయాన్ని పిక్చర్ రూపంలో పొందుపరిచారట. తొలి సినిమా కార్తికేయ, మలి సినిమా ప్రేమమ్ తో రెండు హిట్ లు ఖాతాలో వేసుకున్న చందు ఈ కీలకమైన పాయింట్ తో హ్యాట్రిక్ ప్రయత్నం చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?