Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్ కూ నచ్చని అఖిల్ ట్రయిలర్?

నాగ్ కూ నచ్చని అఖిల్ ట్రయిలర్?

హీరో నితిన్, ప్రతిష్టాత్మకంగా డైరక్టర్ వివి వినాయక్ డైరక్షన్ లో రూపొందిస్తున్న అఖిల్ సినిమా కొన్ని రోజుల క్రితం చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. కానీ తొలి ట్రయిలర్ బయటకు వచ్చాక అంతా చల్లారిపోయింది. ఆ ట్రయిలర్ జనాలను ఆకట్టుకోలేకపోవడమే అందుకు కారణం. దాంతో మళ్లీ మరో సూపర్ డూపర్ ట్రయిలర్ వస్తుందని వార్తలు వినిపించాయి. కానీ సినిమా ఇంకో రెండు వారాల్లో వున్నా కూడా రాలేదు. 

దీని వెనుక కూడా కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 2న విడుదల చేద్దామని మరో ట్రయిలర్ కట్ చేసారట. దాన్ని ముందుగా నాగ్ కు చూపించారట. కానీ అది ఆయనకు నచ్చలేదట..'ఏం ట్రయిలరో ఏంటో? ఏం తీసారో, ఏం చేసారో' అని పెదవి విరిచాడని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో దాన్ని కూడా పక్కన పెట్టేసారట.

ఇంక మరి ట్రయిలర్ ఇస్తారో? మేకింగ్ విడియోలు ఇస్తారో? సాంగ్స్ విడియోలు వదుల్తారో? ఇంకేం చేస్తారో..మొత్తానికి గట్టిగా పది రోజులు సమయం మాత్రమే వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?