Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగార్జున, వర్మ సినిమాలో హీరోయిన్

నాగార్జున, వర్మ సినిమాలో హీరోయిన్

ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు నాగార్జున. ఈమధ్యే ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ బయటకొచ్చింది. ఈ మూవీలో నాగ్ సరసన అనుష్కను హీరోయిన్ గా తీసుకున్నారట.

అనుష్కను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేసిందే నాగార్జున. అందుకే నాగ్ అడిగితే అతడి సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి కూడా అనుష్క ఎప్పుడూ రెడీ. అలా నాగ్, అనుష్క కాంబినేషన్ లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. తాజాగా వర్మ మూవీ కోసం కూడా అనుష్కను తీసుకోవాలని అనుకుంటున్నాడట నాగ్.

బాహుబలి-2తర్వాత ఇప్పటివరకు మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు అనుష్క. ఆమె నటించిన భాగమతి సినిమా కూడా బాహుబలి-2 టైమ్ నాటిదే. అలా లాంగ్ గ్యాప్ తర్వాత నాగ్ సినిమాలో నటించడానికి అనుష్క ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే హీరోయిన్ ఎంపికపై ఓ క్లారిటీ రానుంది.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన సెట్ లో నాగార్జునపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. హలో సినిమా విడుదలైన తర్వాత సెకెండ్ షెడ్యూల్ ప్రారంభమౌతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?