Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్‌.. ఎన్టీఆర్‌ని వదిలేసినట్టే!

నాగ్‌.. ఎన్టీఆర్‌ని వదిలేసినట్టే!

నాగార్జున ఈమధ్య సెలక్టివ్‌గా సినిమాలు ఒప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. భాయ్‌ తర్వాత సోలో హీరోగా నటించడానికి నాగార్జున ఆసక్తి చూపించట్లేదు. చాలా ఆఫర్లని ఆయన వద్దనుకున్నాడు. మనం తర్వాత ఇంతవరకు మరో సినిమాకి సంతకం చేయని నాగార్జున త్వరలో ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ చేస్తున్నాడనే వార్తలొస్తున్నాయి. 

వంశీ పైడిపల్లి ఈ ఇద్దరి కలయికలో సినిమా చేసేందుకు కథ సిద్ధం చేస్తున్నాడు. కాకపోతే ఈ చిత్రం మొదలు కావడానికి ఇంకా టైమ్‌ పడుతుంది కనుక ఎన్టీఆర్‌ ఈలోగా పూరి జగన్నాథ్‌ సినిమా చేస్తున్నాడు. అంతదాకా తాను మాత్రం ఖాళీగా ఉండడం ఎందుకనుకున్నాడో ఏమిటో కానీ నాగార్జున కూడా ఎన్టీఆర్‌ని వదిలిపెట్టి తన కొత్త సినిమా స్టార్ట్‌ చేస్తున్నాడు. 

నాగార్జున హీరోగా ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో పి. రామ్‌ మోహన్‌ దీనిని నిర్మిస్తున్నాడు. త్వరలోనే సెట్స్‌ మీదికి వెళుతున్న ఈ చిత్రాన్ని మూడు నెలల్లో పూర్తి చేసేస్తారట. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?