Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్ సంతాపం తెలుపలేదేలనో?

నాగ్ సంతాపం తెలుపలేదేలనో?

దర్శకుడు బాపు మృతికి టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది సంతాపం వ్యక్తం చేసారు. అవకాశం వున్నవాళ్లు అక్కడికే వెళ్లి మృతదేహాన్ని దర్శించి, నివాళులు అర్పించారు. నిజానికి టాలీవుడ్ లో బాపు,రమణలు ఎక్కువగా అసోసియేట్ అయిన హీరో ఎవరంటే అది అక్కినేని ఒక్కరే. ఇటు అక్కినేనికి రమణ అన్నా, అటు బాపు రమణలకు అక్కినేని అన్నా చాలా ఇష్టం. ఒక విధంగా ఎన్టీఆర్ కు దూరంగానే వున్నారు ఇద్దరూ. ఇవన్నీ రమణ రచన కొతికొమ్మచ్చి చదివిన వారికి తెలిసిన సంగతులే.

అయినా ఎన్టీఆర్ బాపు రమణ ల ప్రతిభ తెలుసు కనుక, తాను అధికారంలోకి వచ్చాక, పాత విషయాలు గుర్తు తెచ్చుకోక, వారిని పిలిచి మరీ విడియో పాఠాల ప్రాజెక్టు అప్పగించారు. అదీ గొప్పతనం. ఆ తరువాత వారు ఎన్టీఆర్ తో శ్రీనాధకవిసార్వభౌమ చేసారు. అదంతా వేరే సంగతి. 

అయితే బాపు రమణలు ఇంతలా అభిమానించిన అక్కినేని కుటుంబం నుంచి మాత్రం ఏ ఒక్కరూ సంతాపం తెలిపిన జాడ కనిపించలేదు. తండ్రి అంటే అపార గౌరవం వున్న నాగ్, తన తండ్రికి మంచి మిత్రుడైన బాఫు చనిపోతే ఓ ప్రకటన చేయడానికి ఏమొచ్చిందో? దీని వెనుక వైనమేమిటో? పోయినోళ్లందరూ మంచోళ్లు అంటారు. మరణించిన వారి గురించి నాలుగు మంచి ముక్కలు మాత్రమే చెప్పడం మంచి సంప్రదాయం. అది మరిచిపోతే ఎలా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?