Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ముందుగా నాగ్ తోనే వర్మ సినిమా!

ముందుగా నాగ్ తోనే వర్మ సినిమా!

మామూలుగా అయితే నాగార్జునతో రాంగోపాల్ వర్మ సినిమా అంటే.. చాలా క్రేజీ కాంబినేషన్ కిందలెక్క. ఒకప్పట్లో శివ సినిమాతో సంచలనాలు నమోదు చేసిన ఈ ద్వయం గోవిందా గోవిందా తర్వాత మరో సినిమా ప్రయత్నం చేయలేదు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. నవంబరులో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళుతుందనేది ఫిలింనగర్ లో వినిపిస్తున్న తాజా గుసగుస. 

టాలీవుడ్ లో సంచలనాలకు సంబంధించి.. ప్రేక్షకలోకం యావత్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించే మాట్లాడుకుంటున్నారు. రాంగోపాల్ వర్మ ప్రస్తావన ఏ ఇద్దరి మద్య వచ్చినా సరే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎలాంటి బాంబులు పేలుస్తారో.. రాజకీయంగా అవి ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో అనేదే ప్రధాన చర్చనీయాంశంగా ఉంటోంది. కేవలం సినీప్రియులు మాత్రమే కాదు.. అధికార విపక్షాలకు చెందిన రాజకీయ నాయకులు కలిసినా కూడా వారి మాటల మధ్యలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రస్తావన వస్తున్నదంటే అతిశయోక్తి కాదు. 

ఇలా లోకం మొత్తం ఆ చిత్రం తాలూకు మత్తులో ఉండగా.. రాంగోపాల్ వర్మ మాత్రం.. సైలెంట్ గా నాగార్జునతో చేయబోయే సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ ను ఫైనలైజ్ చేసుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం సొంత ప్రొడక్షన్ గానే చేయబోతున్నారు. నవంబరులో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్ లోగా పూర్తి చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. నాగార్జునతో వర్మ కాంబినేషన్ అంటే.. ఇటీవలి వర్మ వైఫల్యాలు అన్నిటినీ ప్రజలు మర్చిపోయి... మళ్లీ క్రేజీగానే ఎదురుచూస్తారనడంలో సందేహం లేదు. 

మరీ వర్మ నుంచి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఎదురుచూస్తున్న వారి కోరికను ఆయన ఎప్పుడు తీరుస్తారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?