Advertisement


Home > Movies - Movie Gossip
నాగార్జునతో యంగ్ డైరక్టర్.. ఆ వ్యక్తి అతడేనా?

కల్యాణ్ కృష్ణతో చేయాల్సిన సినిమా ఇంకా పక్కా కాలేదు. ఎందుకంటే బంగార్రాజు టైటిల్ పై తీయబోయే సినిమా కథ ఇంకా రెడీ కాలేదు కాబట్టి. ఇక మరో దర్శకుడు చందు మొండేటి చెప్పిన కథ నాగ్ కు నచ్చినప్పటికీ.. అది నాగచైతన్యకు అయితే బాగుంటుందని తిరిగి చైతూకే అప్పగించాడు. ప్రస్తుతం నాగార్జున లిస్ట్ ఖాళీ. ఇలాంటి టైమ్ లో ఓ యంగ్ డైరక్టర్ నాగ్ తో సంప్రదింపులు జరిపాడు. అతడే విరించి వర్మ.

ఉయ్యాల జంపాల సినిమాతో పాపులర్ అయిన విరించి వర్మ, తాజాగా నాని హీరోగా మజ్ను సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడు తన మూడో ప్రయత్నంగా నాగార్జునతో సినిమా చేయబోతున్నాడట విరించి వర్మ. ఈ మేరకు నాగ్ కు ఓ కథ  కూడా వినిపించాడట.

విరించి వర్మ మొదటి సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు బాగా ప్రచారం కూడా చేశాడు నాగార్జున. ఇప్పుడు అతడి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. అయితే ఈ కథకైనా నాగార్జున ఓకే చెబుతాడా.. లేక మరోసారి అఖిల్ లేదా నాగచైతన్యకు అప్పగిస్తాడా అనేది చూడాలి. ప్రస్తుతం నాగార్జున చేతిలో రాజుగారి గది-2 సినిమా మాత్రమే ఉంది.