Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగశౌర్య ఫీలవుతున్నాడా?

నాగశౌర్య ఫీలవుతున్నాడా?

చకచకా సినిమాలు చేస్తున్న లవర్ బాయ్ లుక్ వున్నహీరో నాగశౌర్య. లేటెస్ట్ గా అతగాడు నటించిన ఒక్క మనసు సినిమా విడుదలకు సిద్దం అయింది. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా వస్తున్న నీహారిక తొలి సినిమా ఇది. మెగా కుటుంబం నేపథ్యం, బ్యాకింగ్ రెండూ ఉండడంతో సహజంగానే ఈ సినిమాకు కాస్త క్రేజ్ వచ్చింది. 

ఇది నాగశౌర్య సినిమా అని కాకుండా నీహారిక సినిమా అన్నది ప్రచారంలోకి వెళ్లిపోయింది. దీనికి తోడు ఇటీవల జరిగిన అడియో ఫంక్షన్ మొత్తం నీహారిక మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లా కనిపించింది తప్ప, అందులో నాగశౌర్య హీరో అని, ఇది అతగాడి సినిమా ఫంక్షన్ అని ఎక్కడా అనిపించలేదని టాక్. 

ఇప్పుడు ఇదే నాగశౌర్యను ఫీల్ అయ్యేలా చేస్తోందని వినికిడి. ఇటీవల ఓ ఛానెల్ గేమ్ షోకి నాగశౌర్య రావాలని కాంట్రాక్ట్ చేస్తే, సింగిల్ గా రమ్మంటే వస్తానని, హీరోయిన్ వస్తే రానని కబురు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఏం చేయాలో తోచక గేమ్ షో నిర్వాహకులు సైలెంట్ అయ్యారట. మరి ముందు ముందు ఎలా వుంటుందో ఈ వ్యవహారం?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?