Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగబాబు అలా ఎందుకు అని వుంటారంటే..?

నాగబాబు అలా ఎందుకు అని వుంటారంటే..?

ఆగస్టు 22 మెగాస్టార్ బర్త్ డే. అది వస్తోందంటేనే మెగాఫ్యాన్స్ కు అందరికీ చాలా హడావుడి..సందడి..ఆ ఆనందమే వేరు. అయితే ఈసారి మెగా స్టార్ బర్త్ డే కు కానీ, లేదా మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ కు కానీ ఫ్యాన్స్ తమ డబ్బులు ఏవీ ఖర్చుచేయవద్దని మెగా బ్రదర్ నాగబాబు ఈసారి ఫ్యాన్స్ అపీల్ చేసారని తెలుస్తోంది. 

నాగబాబు ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ కావడం అన్నది కామన్. ఆ మాటకు వస్తే మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ కు మధ్య వున్న వారథి నాగబాబే. అందువల్ల ఆయన ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ కావడం కానీ, వాళ్లకు క్లియర్ ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వడంలో కూడా ఆయన పెర్ ఫెక్ట్.అయితే ఫ్యాన్స్ స్వంతడబ్బులు ఖర్చు చేయవద్దని ఈ సారి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏమయి వుంటుంది అన్న దానిపై పలు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.  

వాటిల్లో ప్రథానమైనది గత ఏడాది చిరు 60వ బర్త్ డే సంధర్భంగా భారీగా కలెక్షన్లు చేయడం, భారీగా ఫంక్షన్ లు చేయడం, ఫంక్షన్ లకు కోట్లు వేసుకోవాలి..ఇలాంటి అనేక వ్యవహారాలు జరిగినట్లు వదంతులు వినపించాయి. దీనిపై మెగాభిమానుల్లోనే అప్పట్లో కాస్త భిన్నాభిప్రాయాలు వినిపించాయి. 

అందుకే వీటన్నింటిని దృష్టిలో వుంచుకునే నాగబాబు ఈ సారి ముందుగా ఇలా చిన్న విన్నపం చేసి వుంటారేమో? అయినా ఎవరి అభిమాన హీరోల సినిమా విడుదలలకు, పుట్టిన రోజులకు అభిమానులు ఆ మాత్రం జేబుల్లోంచి ఖర్చు చేయడం కామన్ కదా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?