Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగబాబు మాటల్లో పవన్ వ్యూహం

నాగబాబు మాటల్లో పవన్ వ్యూహం

ఎవరైనా రాజకీయపార్టీ ఎందుకు పెడతారు. ప్రజల సేవ కోసం అని చెప్పకండి..ఈ రోజుల్లో జనం ఇట్టే నవ్వేస్తారు. అధికారం కోసమే. పవన్ కళ్యాణ్ జనసేన కూడా అందుకోసమే. అందులో సందేహం లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తాం అని పవన్ నే చెప్పేసారు. ఇక అందులో సందేహం లేదు.

కానీ చాలా మంది అనుకునేది అసలు పవన్ లక్ష్యం ఏమిటి? పవన్ చెప్పేది..ప్రజల పక్షాన నిలబడ్డం కోసం, ఇంకా..చాలా..చాలా..అంతే. నిజానికి కేవలం మంత్రినో, ఉపముఖ్యమంత్రినో, కేంద్రమంత్రినో కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ ఇంత కిందా మీదా పడిపోనక్కరలేదు. తెలుగుదేశం పార్టీ పిలిచి మరీ ఆయన కోరింది చేయడానికి సిద్ధంగావుంది. ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప ఏదయినా ఇస్తుంది. 

అంటే జనసేన పార్టీ టార్గెట్ ఆంధ్రలో అధికారంలోకి రావడమే అని ఎవరైనా అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం, మొన్నటికి మొన్న, 2019 ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తాం అని అన్యాపదేశంగా చెప్పేసారు. అప్పుడే జనం అనుకున్నారు. 2019 ఎన్నికల్లో కూడా తెదేపా-జనసేన పొత్తు వుంటుందని.

ఇప్పుడు ఇదే ఊహాగానాలకు బలం చేకూర్చేలా మాట్లాడుతున్నారు పవన్ సోదరుడు నాగబాబు కూడా. 2019 ఎన్నికల సందర్భంగా పవన్ జస్ట్ ఓ మూడేళ్లు సినిమా రంగానికి దూరం కావాల్సి వుంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. కొమరం పులిటైమ్ లో కూడా ఇలా జరిగిందని. పవన్ లాంటి పవర్ స్టార్ కు మూడేళ్లు పెద్ద గ్యాప్ కాదని ఆయన అంటున్నారు. 2018 నుంచి 2020 వరకు అన్నమాట. 

అంటే ఎన్నికల ముందు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి, తెలుగుదేశాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చి, మళ్లీ తన సినిమాలు తాను చేసుకునే ఆలోచనలో వున్నారు పవర్ స్టార్ అని అర్థమైపోతోంది. అంటే జనసేన జనం కోసం కన్నా, జగన్ ను ఓడించడం కోసమే అనుకోవాలా? ఏమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?