Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నక్కతోక తొక్కిన దానయ్య

నక్కతోక తొక్కిన దానయ్య

టాలీవుడ్ లో రెండు చిత్రమైన పాయింట్లు వున్నాయి. 

ఎవరి దగ్గరైనా సరే కచ్చితంగా అడ్వాన్స్ వుండే నిర్మాత ఒకరు వున్నారు.

రాజమౌళి దగ్గర వున్నది ఒకే ఒక నిర్మాత అడ్వాన్స్.

ఈ రెండు పాయింట్లకు ఒకటే ఆన్సర్..అది...డివివి దానయ్య.

నిజమే, ఇండస్ట్రీలో అప్ కమింగ్ జనాలను టక్కున పట్టేసుకుని, టాలెంట్ కనిపెట్టేసి, అడ్వాన్స్ చేతిలో పెట్టేయడం అన్న విద్య డివివి దానయ్యకు వచ్చినట్లు మరెవరికి రాదేమో? దాదాపు ఇండస్ట్రీలో అందరి దగ్గర దానయ్య అడ్వాన్స్ వుంటుంది. అయితే ఆ తరువాత వాళ్లు దానయ్యకు సినిమా చేయకపోతే కూడా పరిస్థితి వేరుగా వుంటుంది. వడ్డీలతో సహా ముక్కుపిండి వసూలు చేసేస్తారని టాక్. హరీష్ శంకర్, మారుతి ఇలా చెల్లించిన వారే. 

ఆ సంగతి పక్కన పెడితే, ఇలా దానయ్య నాటిన విత్తనాలు మొలకలై ఆయనకు బంగారు పంట పండించబోతున్నాయి ఇప్పుడు. బండ్లగణేష్ తో పాటు ఇంచుమించు ఒకేసార కొరటాల శివకు అడ్వాన్స్ ఇచ్చారు దానయ్య. బండ్ల గణేష్ పాపం, సినిమాచేసుకోలేకపోయారు. ఇప్పుడు దానయ్య వంతు వచ్చింది. మహేష్ తో అదే టైమ్ లో కొరటాల శివ సినిమా చేయాల్సి వచ్చింది. సో, అలాంటి భయంకరమైన బ్లాక్ బస్టర్ కాంబినేష్ ఇప్పుడు వచ్చి దానయ్య వళ్లో వాలింది.

ఇక ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన అడ్వాన్స్ లు తీసుకోరు. ఆయన దగ్గర వున్న ఒకే ఒక అడ్వాన్స్ దానయ్యదే. అదెప్పుడో పూర్వాశ్రమంలో ఇచ్చింది. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి రాజమౌళి బాహుబలి తరువాత తన సినిమాను దానయ్య కు చేయబోతున్నారని టాక్. 

బాహుబలి తరువాత రిలీఫ్ గా వుండేందుకు ఓ చిన్న సినిమా చేయాలని రాజమౌళి అనుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో మర్యాద రామన్న మాదిరిగా. మరి ఏ హీరోతో చేస్తారో తెలియదు కానీ, నిర్మాత అయితే దానయ్యే. చిన్న సినిమా అయినా రాజమౌళి బ్రాండ్ పడితే అది పెద్ద సినిమా అయిపోతుంది. అంటే ఈ విధంగా దానయ్య ఎప్పుడో నాటిన అడ్వాన్స్ విత్తనాలు ఇప్పుడు మొలకెత్తి బంగారు పంట పండించబోతున్నాయ్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?