Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాని సినిమాకు 15 కోట్లు

నాని సినిమాకు 15 కోట్లు

మాంచి సక్సెస్ జోరు మీద వున్న మీడియం రేంజ్ హీరో నాని. ప్రస్తుతం నాలుగు కోట్ల నుంచి అయిదు కోట్ల రేంజ్ లో వుంది నాని పారితోషికం. నేను లోకల్ తరువాత కోటి పెంచాడు.

నిన్ను కోరికి నాలుగు కోట్లు తీసుకున్నాడు. దీంతో నిను కోరి సినిమా ఖర్చు 15 దాకా డేటేసిందని తెలుస్తోంది. అంటే ఎలా లేదన్నా సినిమాను ఆ రేంజ్ లో అమ్మితే, శాటిలైట్ లాభంగా మిగులుతుంది.

అయితే నాని సినిమాల మార్కెట్ కూడా తక్కువేమీ లేదు. నేను లోకల్ ముఫై కోట్ల వరకు వసూళ్లు సాదించింది. అయితే అది మాస్ సినిమా. నిన్ను కోరి క్లాస్ సినిమా. అందువల్ల ఏమేరకు వసూళ్లు సాదిస్తుందో చూడాలి.

అయితే ఇక్కడ లక్కీ ఏమిటంటే, నిను కోరి సినిమాకు పెద్దగా కాంపిటీషన్ అంటూ ఏమీ లేదు వన్ వీక్ దాదాపు సోలోగా కలెక్షన్లు దున్నేసుకోవచ్చు. కానీ ఆ తరువాత మాత్రం కాస్త పోటీ తగులుతుంది. ఆ పోటీని తట్టుకోవాలి అంటే మాత్రం నిన్ను కోరి సినిమాకు కాస్త గట్టి టాక్ నే రావాల్సి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?