Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నందమూరి హీరో పక్కా ప్లానింగ్

నందమూరి హీరో పక్కా ప్లానింగ్

మొన్నటివరకు “చేతులు కాల్చుకోవడం” అనే పదానికి ఎగ్జాంపుల్ గా మారిపోయాడు నందమూరి కల్యాణ్ రామ్. తనే హీరోగా నటించి, తన సినిమాల్ని తానే నిర్మించుకొని అడ్డంగా బుక్కయిపోయాడు. ఒక దశలో పీకల్లోతు నష్టాల్లో కూడా కూరుకుపోయాడు. అలాంటి కల్యాణ్ రామ్ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.

తను హీరోగా బయట బ్యానర్లతో సినిమాలు చేస్తున్నాడు. నిర్మాతగా సొంత బ్యానర్ పై మినిమం గ్యారెంటీ సినిమాలు చేస్తున్నాడు. అలా హీరోగా క్లిక్ అవుతూనే, నిర్మాతగా డబ్బులు సంపాదించాలని ఫిక్స్ అయ్యాడు.

ప్రస్తుతం ఎంఎల్ఏ అనే సినిమా చేస్తున్నాడు కల్యాణ్ రామ్. ఇది తన సొంత బ్యానర్ లో చేస్తున్న సినిమా కాదు. బయట నిర్మాతలకు చేస్తున్నాడు. ఇక తను నిర్మాతగా ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ అందుకున్నాడు కల్యాణ్ రామ్.

జై లవకుశ తర్వాత కూడా తన బ్యానర్ పై తనే హీరోగా సినిమా చేయడంలేదు. ఈసారి నానితో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నాని హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట కల్యాణ్ రామ్. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నానితో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నమాటే. ఇలా పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు కల్యాణ్ రామ్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?