Advertisement


Home > Movies - Movie Gossip
క్రేజీ సినిమాలు.. కొత్త టైటిల్స్

టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనే ట్రెండ్ ఎప్పుడో మొదలైంది. ఆ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ.. మరికొన్ని సినిమాలకు క్రేజీ టైటిల్స్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫిలింఛాంబర్ లో సరికొత్త టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి.

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ టైటిల్ రిజిస్టర్ అయింది. ఈనెల 19న ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, తొలిప్రేమ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. శ్రీవెంకేటశ్వర సినీచిత్ర బ్యానర్ పై వరుణ్ తేజ్-రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమాకు ఈ టైటిల్ పెట్టబోతున్నారు.

ఇక డీజే తర్వాత హరీష్ శంకర్ చేయబోయే సినిమాకు కూడా టైటిల్ ఫిక్స్ అయింది. దిల్ రాజు బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు దాగుడు మూతలు అనే టైటిల్ పెడతారంటూ గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు అదే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. 

వీటితోపాటు సీటీమార్, యాత్ర, విటమిన్-ఎమ్ అనే వెరైటీ టైటిల్స్ కూడా రిజిస్టర్ అయ్యాయి. తన సొంత బ్యానర్ పై నిర్మించనున్న సినిమాకు సీటీమార్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు సంపత్ నంది. ఆనందోబ్రహ్మ లాంటి హిట్ సినిమా తీసిన 70ఎంఎం బ్యానర్ పై యాత్ర, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై విటమిన్-ఎమ్ టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి.