Home > Movies - Movie Gossip
బాలకృష్ణ కొత్త సినిమా పేరు అదే...?

బాలకృష్ణ-పూరిజగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. అయితే అంతకంటే ముందే బాలకృష్ణ-కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. తాజా సమాచారం ప్రకారం బాలయ్య సినిమాకు "రెడ్డి గారు" అనే టైటిల్ అనుకుంటున్నారు.

సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి సినిమాల తర్వాత మళ్లీ ఇలా రెడ్డి అనే పదం వచ్చేలా బాలయ్య సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నేళ్లకు రెడ్డి గారు అనే టైటిల్ తెరపైకి వచ్చింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాకు ఈ టైటిల్ అయితేనే కరెక్ట్ గా ఉంటుందని ఫ్యాన్స్ ఇప్పటికే డిస్కషన్ పెట్టారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఇలా కులాల పేరుతో టైటిల్స్ పెట్టే కల్చర్ కాస్త తగ్గింది. అనవసరంగా వివాదాలు కొనితెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో చాలామంది ఇలాంటి టైటిల్స్ ను పక్కనపెడుతున్నారు. మరీ ముఖ్యంగా బాలయ్య ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా. ఇలాంటి టైమ్ లో ఈ తరహా టైటిల్స్ ను ఆయన ప్రోత్సహిస్తారా అనేది చూడాలి.