Advertisement


Home > Movies - Movie Gossip
మహేష్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్

మహేష్ ఫ్యాన్స్ కోసం నూతన సంవత్సర బహుబతి రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ లేదా టైటిల్ ను విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 31అర్థరాత్రి లేదా జనవరి 1ఉదయం ఈ లుక్ బయటకు రాబోతోంది. 

ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాకు మరికొన్ని టైటిల్స్ కూడా పరిశీలిస్తున్నారట. భరత్ అనే నేను టైటిల్ దాదాపు ఆడియన్స్ కు రిజిస్టర్ అయిపోయింది. ఇదే పేరుతో ఈ సినిమాను పిలుస్తున్నారంతా. కానీ మేకర్స్ మాత్రం ఈ టైటిల్ ను అఫీషియల్ గా ఇంకా ఎనౌన్స్ చేయలేదు. సో.. నూతన సంవత్సరంలో టైటిల్ పై సస్పెన్స్ వీడనుంది. 

మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఉన్న సందిగ్దత కూడా అదే రోజున తొలిగిపోయే అవకాశముంది. ప్రస్తుతం భరత్ అనే నేను, నా పేరు సూర్య, 2.0సినిమాల మధ్య విడుదల తేదీపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇంతకుముందే చెప్పినట్టు ఏప్రిల్ 27కే ఫిక్స్ అవుతారా.. లేక మరో కొత్త తేదీ ప్రకటిస్తారా అనే విషయంపై కూడా న్యూ ఇయర్ లో క్లారిటీ రానుంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ మూవీని 2వారాలు ముందుకు జరిపినట్టు తెలుస్తోంది.

ఈ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే 2-3 స్టిల్స్ లీక్ అయ్యాయి. అలా లీక్ చేయొద్దంటూ కొరటాల రిక్వెస్ట్ చేశాడు కూడా. అయినప్పటికీ సెట్స్ నుంచి ఎప్పటికప్పుడు ఫొటోలు బయటకొస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు.