Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాహుబలి.. చిన్న సినిమాల చేతిలో ఓటమి!

  బాహుబలి.. చిన్న సినిమాల చేతిలో ఓటమి!

మాటెత్తితే తెలుగు సినిమా కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనే ఉపమానాన్ని జోడిస్తారు బాహుబలి సినిమాకు. బాహుబల్ 1 అండ్ 2.. రెండు వెర్షన్ల విషయంలోనూ ఇదే ఉపమానాన్ని ఉపయోగించడం అలవాటు అయిపోయింది. అదేమంటే.. కలెక్షన్ల లెక్కలు చెబుతారు. కమర్షియల్ గా హిట్ అయిన విధానాన్ని వివరిస్తారు.

మరి అంతర్జాతీయ ఖ్యాతిని చాటిందని అన్నారు కాబట్టి.. ఒక ఆస్కార్ అవార్డ్ ను అయినా వేసుకుని వస్తుందా? అంటే.. నీళ్లు నమలడం బాహుబలి వీరాభిమానుల వంతు అవుతుంది. అందుకు తగ్గట్టుగా ఆస్కార్స్ విషయంలో ఇండియన్ ఎంట్రీగా టికెట్ సంపాదించుకోలేకపోయింది బాహుబలి-2. ఇది వరకూ బాహుబలి సినిమా ఇండియన్ ఎంట్రీ కోసం పోటీ పడి భంగపడగా, బాహుబలి-2కి కూడా అదే అనుభవమే ఎదురైంది.

చివరకు చోటా సినిమా ‘న్యూటన్’ ఇండియా తరఫున ఆస్కార్స్ కు టికెట్ సంపాదించింది. మరి అంతర్జాతీయ ఖ్యాతి, అంతర్జాతీయ ఖ్యాతి అంటే ఏమిటో అనుకున్నాం.. బాహుబలి కానీ, బాహుబలి 2 కానీ.. దేశీయ సినిమాలను దాటి ఆస్కార్స్ కు ఎంట్రీ ఇవ్వలేకపోయాయి. క్రితం సారి బాహుబలి ఆస్కార్స్ టికెట్ కోసం పోటీ పడ్డప్పుడు తమిళ సినిమా ‘విసారణై’ ఇండియన్ ఎంట్రీగా నిలిచింది.

అతి తక్కువ బడ్జెట్ తో పెద్దగా వసూళ్లు కూడా రాని ఆ సినిమా భారత్ పరువును కొంత వరకూ నిలిపింది. అవార్డు రేసులో కొంత వరకూ ముందుకు వెళ్లింది. మరి మంచి సినిమా, అంతర్జాతీయ స్థాయి సినిమా వేరు.. కమర్షియల్ గా హిట్టయ్యే బాహుబలి బాపతు సినిమా వేరు... అనే విషయాన్ని చాటి చెబుతోంది ఆస్కార్స్ కు భారత ఎంట్రీ ఎంపిక. బాహుబలికి ముందు ‘అంతర్జాతీయ స్థాయి’ అనే మాటను ఇకనైనా వదిలేస్తే మేలేమో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?