Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిధి అగర్వాల్ – చేజారిన అదృష్టం

నిధి అగర్వాల్ – చేజారిన అదృష్టం

ఒక్కోసారి అవకాశం గుమ్మంలో కాలు పెట్టి కూడా మళ్లీ వెనక్కు తీసుకుంటుంది. బాలీవుడ్ అప్ కమింగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ విషయంలో అలాగే జరిగింది. అన్నీ అనుకున్నట్లు జరిగివుంటే, ఈ పాటికి తెలుగు సినిమా జనాలు ఆమె గురించి మాట్లాడుకుంటూ వుండేవారు. ఎందుకంటే టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ సరసన నటించే అవకాశం వచ్చి నట్లే వచ్చి, చేజారిపోయింది.

విషయం ఏమిటంటే, ప్రభాస్ తన సాహో సినిమా కోసం హీరోయిన్ల వేట సాగించిన సంగతి తెలిసిందే. నాలుగు వారాల క్రితం వరకు నిధి అగర్వాల్ పేరు పరిశీలించారు. అదే టైమ్ లో టైగర్ షరాప్ సరసన నిధి నటించిన మున్నా మైఖేల్ సినిమా విడుదల దగ్గర పడింది. సరే, ఆ సినిమా విడుదలయిన తరువాత మరోసారి స్క్రీన్ ప్రెజెన్స్ చూసి నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు.

గత నెల ఆఖరులో ఆ సినిమా విడుదలయింది. కానీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో విజయం సాధించలేదు. దాంతో ప్రభాస్ అండ్ కో నిర్ణయం మారిపోయింది. గెలుపు గుర్రాల వైపే చూడడం అన్నది కామన్ కదా? అందుకే నిధి పేరును జాబితాలోంచి తీసేసారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?