Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిజాలు ఇండస్ట్రీకి తెలుసు ఎన్టీఆర్

నిజాలు ఇండస్ట్రీకి తెలుసు ఎన్టీఆర్

కలెక్షన్లు, రికార్డులు, ఇవన్నీ తెలుగు చలనచిత్ర సీమలో ఇమేజనరీ వ్యవహారాలు. ఎందుకంటే ఎవ్వరూ ఎక్కడా సరియైన లెక్కలు చూపించరు. పైగా అసలు నిజాలు చెప్పరు. చెప్పలేక కాదు. చెప్పడం కుదరక. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కడి లింక్ లు అక్కడ వుంటాయి. తప్పదు. 

కోర్టులో గెలిచినవాడు ఇంట్లో ఏడుస్తాడు. ఓడిన వాడు కోర్టులో ఏడుస్తాడు అన్నది సామెత. హిట్ సినిమా నిర్మాత సైతం ఇంట్లో బాధపడాల్సిన పరిస్థితి ఇవ్వాళ టాలీవుడ్ లో వుంది. అట్టర్ ఫ్లాప్ సినిమాకు సైతం మూడో రోజు సక్సెస్ మీట్ చేస్తారు. ఏదో విధంగా సినిమాను లేపాలని. అక్కడ చిరునవ్వుల చిందించక తప్పదు. ఇది కామన్. వ్యాపారంలో ఇది లైట్ తీసుకోవాల్సిందే కానీ ఫ్రస్టేట్ కాకూడదు. 

సినిమా హీరోల ధైర్యం ఏమిటంటే తమ ముందు ఎవ్వరూ ఏమీ మాట్లాడరని. ముఫై, నలభై కోట్లలో లేదా యాభై కోట్లలో సినిమా తీసి వంద కోట్ల రేంజ్ లో అమ్ముకున్నారేమీ? అని ఎవ్వరూ అడగరు. ముఫై శాతం పోయినా ఎవ్వరూ మాట్లాడరు. నాన్నకు ప్రేమతో విషయంలో యుకె నుంచి వచ్చే సబ్సిడీతో గట్టెక్కామని నిర్మాత బోగవిల్లి ప్రసాద్ చెప్పగలరా? చెప్పరు. ఎందుకంటే ఆయనకు మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి.

జై లవకుశ కాస్త లాస్ వచ్చినా ఈస్ట్ బయ్యర్ భరత్ చౌదరి చెబుతారా? ఆయన కళ్యాణ్ రామ్ తో సిన్మా నిర్మిస్తున్నారు. మళ్లీ ఎన్టీఆర్ సినిమా ఏదన్నా వస్తే కొనాలి. 

అలాగే కృష్ణా, గుంటూరు కొన్న సుధాకర్ చెబుతారా? ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ తో సినిమా నిర్మిస్తున్నారు. దిల్ రాజు చెబుతారా? ఆయనకు ఎన్టీఆర్ తో మరో సినిమా చేయాలని వుందని టాక్. ఇలా ఎవరి ఆబ్లిగేషన్లు వారికి వున్నాయి.

కానీ లెక్కలు ఇవ్వాళ కాకుంటే రేపు అయినా వస్తాయి. సర్దార్ గబ్బర్ సింగ్ లెక్కలు కాటమరాయుడు టైమ్ లో బయటకు వచ్చినట్లు. నిజంగా విమర్శకుల మీద దాడి చేయాలనుకుంటే, బడా హిట్ లు అని ప్రచారం చేసిన పది సినిమాల డిసిఆర్ లు బయటపెట్టమనండి. నిర్మాతల చిట్టాలు బయట పెట్టమనండి. ఫిదా హిట్ ను ఎవరన్నా అడ్డుకున్నారా? అర్జున్ రెడ్డికి అడ్డంగా పడుక్కున్నారా? 

బాహుబలిని చూసి నేర్చుకోండి

విమర్శకులు సినిమాను అభిమానుల దృష్టితోనో, కామన్ ఆడియన్స్ దృష్టిలోనో చూడరు. క్వాలిటీ మేకింగ్, క్వాలిటీ క్రియేటివిటీ, అన్న దృష్టితో చూస్తారు. అందుకే ప్రపంచ రికార్డులు సృష్టించిన బాహుబలి వన్ కు విమర్శకుల నుంచి నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. అయినా బాహుబలి మేకర్లు ఏమన్నా మాట్లాడారా? జనాలు ఆదరించారు. డబ్బులు భయంకరంగా వచ్చాయి.

అప్పుడన్నా, విమర్శకులను వ్వె..వ్వె..వ్వె..అని వెక్కించారా? రాజమౌళి మాటలు విసిరిరా? నిర్మాతలు రికార్డులు ప్రకటించారా? వారి పని వారు చేసుకుపోయారు. ఎప్పుడన్నా, ఎక్కడన్నా విజయమే మాట్లాడుతుంది. జై లవకుశ కూడా 80కోట్లకు పైగా షేర్ సంపాదించి, బయ్యర్లు అంతా ఖర్చులు తెచ్చుకోకున్నా ఎవరి డబ్బులు వారు వెనక్కు తెచ్చుకుంటే, అప్పుడు అదే బయటకు వస్తుంది.

ఎవరికి నిజాలు తెలియకున్నా, ఇండస్ట్రీకి తెలుస్తాయి. దాన్ని బట్టే మళ్లీ అవకాశాలు అనేవి వుంటాయి. డైరక్టర్లకు అవకాశాలు ఇచ్చేది నికార్సయిన విజయాలే. లాబీయింగ్ కొంత వరకే పని చేస్తుంది. ఎన్టీఆర్ తో రభస సినిమా చేసిన దర్శకుడికి ఇప్పటికి ఇంకో సినిమా తెరపైకి రాలేదు. శక్తి సినిమా నిర్మించిన అశ్వనీదత్ మళ్లీ సినిమా ఇప్పటికి స్టార్ట్ చేయలేదు.

రామయ్యా వస్తావయ్యా చేసిన దర్శకుడు మళ్లీ పెద్ద సినిమా అందిపుచ్చుకోవడానికి ఎన్నేళ్లు పట్టింది. మనమంతా సినిమాను విమర్శకులు నెత్తిన పెట్టుకున్నారు. నిర్మాతకు 15కోట్లు పోయాయి. అప్పుడు ఎవర్ని తిడతారు?  ఇలా ఏకరవు పెడుతూ పోవాలంటే ఎంతమంది గురించి అయినా, ఎంతయినా వుంటుంది. 

ఎన్టీఆర్ గమనించాలి

నటన అన్నది ఎన్టీఆర్ వృత్తి. నిర్మాణం అన్నది కళ్యాణ్ రామ్ వృత్తి. పంపిణీ రంగం అన్నది దిల్ రాజు వృత్తి. అలాగే సినిమా విమర్శ అన్నది మరి కొందరి వృత్తి అని ఎందుకు మరిచిపోతున్నారు. ఇదే విమర్శకులు మీ సినిమాలు నెత్తిన పెట్టుకున్న సంగతులు విస్మరిస్తే ఎలా? టెంపర్ ను ఎవరన్నా ఏమన్నా అన్నారా? నాన్నకు ప్రేమతో సినిమాను ఎత్తి చూపారా? లేదు కదా? ఎన్టీఆర్ తిరుగులేని నటుడు. ఈ జనరేషన్ నటుల్లో అంత స్టామినా వున్న నటుడు మరొకరు లేరు. పాత్ర ఏదయినా, ఘట్టం ఏదయినా, ఆయనకు తిరుగులేదు. 

జై లవకుశ సినిమా విషయం లో కూడా ఎన్టీఆర్ ను ఎవరన్నా ఎత్తి చూపారా? డైరక్టర్ గా, కథ, కథనాలు అందించిన వాడిగా బాబీ వైఫల్యం తప్ప, ఎన్టీఆర్ వైఫల్యం ఏముంది? సినిమా చూసిన వాళ్లంతా ఎన్టీఆర్ అమోఘం అన్నారు కానీ, బాబీ సూపర్ అని ఒక్క ప్రేక్షకుడన్నా అన్నారా? ఈ గ్రౌండ్ రియాల్టీ గమనించకుండా, దారిన పోయే దానయ్యలు అంటూ విమర్శకుల మీద విరుచుకుపడడం ఏమిటి?

అసలు ఎన్టీఆర్ పోలికే సరికాదు. ఐసియులో పేషెంట్ వుండడం అంటే ఫిఫ్టీ ఫిప్టీ చాన్సెస్ అని. అంటే జై లవకుశ పరిస్థితి ఎన్టీఆర్ కు అర్థం అయిందన్నమాట. కానీ ఆయన బాధ అల్లా, ప్రేక్షకులు తిరగొట్టాలి కానీ, ముందే విమర్శకులు చెప్పడం ఏమిటి?అని గతంలో అన్నిఫ్లాప్ లు వచ్చినపుడు విమర్శకులను పల్లెత్తు మాట అనని ఎన్టీఆర్ ఇప్పుడు ఎందుకు ఇలా విరుచుకుపడ్డారు అంటే రెండే కారణాలు తోస్తున్నాయి.

ఒకటి గతంలో అన్నీ ఫ్లాప్ లు అని క్లియర్ గా ముందే తేలిపోయాయి. జైలవకుశకు మంచి ప్రశంసలు దక్కాయి. సినిమా నిలబడుతుంది అనుకున్నారు. కానీ అనుకున్న రేంజ్ లో నిలబడడం లేదు. విమర్శకులు కాస్త వదిలేస్తే, జనాలు చూసి వుండేవారేమో అన్న ఫ్రస్టేషన్ వచ్చి వుండొచ్చు.

రెండవ కారణం. ఈ సినిమా స్వంత బ్యానర్. 36కోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చిన సినిమా. ఇప్పుడు తేడావస్తే బయ్యర్లకు ఏదో విధంగా మాట సాయమో, సినిమా సాయమో చేసి ఆదుకోవాల్సి వుంటుంది. ఇదే నిర్మాత వేరే వాళ్లు అయివుంటే ఎన్టీఆర్ కు ఇంత ఆవేశం వచ్చి వుండేది కాదేమో? 

అయినా ఆడలేక మద్దెల ఓటిది అనడం కామన్. సృజన దగ్గర లోపం పెట్టుకుని, విమర్శకులను అనడం కామన్ అయిపోయింది. లైట్ తీస్కోవడమే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?