Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిఖిల్ బ్యూటీకి ప్లానింగ్ లేదు

నిఖిల్ బ్యూటీకి ప్లానింగ్ లేదు

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా హిట్ అయిన వెంటనే తెలుగులో సినిమాలు చేసుంటే బాగుండేది. కానీ ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోయింది నందిత శ్వేత. సినిమా వచ్చి ఏడాది దాటినా ఇప్పటివరకు మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేకపోయింది. దీనికి కారణం అవకాశాల్లేక కాదు, ప్లానింగ్ లేక.

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సక్సెస్ అయిన వెంటనే తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది నందిత శ్వేత. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ కోలీవుడ్ లో క్లిక్ అవ్వలేకపోయింది. అందుకే ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది ఈ బెంగళూరు బ్యూటీ.

ఎక్కడికి పోవాత్ చిన్నవాడా టీవీల్లో కూడా వచ్చేసింది. ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత నందిత శ్వేత చేయబోయే తెలుగు సినిమాల్ని ప్రేక్షకులు పట్టించుకుంటారా అనేది డౌట్. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా హీరోయిన్ గా ఈమెను గుర్తించుకుంటారా అనేది చూడాలి. అటు నందిత మాత్రం కచ్చితంగా తెలుగులో క్లిక్ అవుతానంటోంది.

తణుకులో ఓ షాప్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇకపై తెలుగులో గ్యాప్ ఇవ్వనంటోంది. ప్రస్తుతం 2 సినిమాలు అంగీకరించాలనని, త్వరలోనే ఆ డీటెయిల్స్ చెబుతానంటోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?