Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిఖిల్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు

నిఖిల్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు

టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు వస్తే, చిన్న, మీడియం హీరోలు కాస్త పాజిటివ్ గా ట్వీట్ చేయడం కామన్. ఆ విధంగా అన్ని క్యాంప్ ల గుడ్ లుక్స్ లో వుండాలనుకుంటారు. అదేం తప్పు కాదు. కానీ ట్విట్టర్ అనేది పబ్లిక్ ఫ్లాట్ ఫారమ్. అక్కడ జనాలు రెడీగా కాచుకుని వుంటారు. అందులోనూ మెహర్బానీలకు పోతే, ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు. హీరో నిఖిల్ కు ఇప్పుడు అదే జరిగింది.

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా విడుదల అయింది. సినిమా ఇంకా చూడకుండానే నిఖిల్ ఓ ట్వీట్ చేసాడు. కాటమరాయుడు గురించి హిట్ రిపోర్ట్ లు వింటున్నానని, ఇది చాలు బాక్సాఫీస్ షేక్ చేసేయడానికి అని, ఓ మాంచి ఫొటో కూడా షేర్ చేసాడు.

దాంతో జనాలు నిఖిల్ ఇంకా ఈ కుర్ర చేష్టలు మాను, ఈ చిల్లర పనులు ఆపేయ్ అంటూ తెగ రిప్లయ్ ట్వీట్ లు చేసారు. సినిమా చూడకుండా నిఖిల్ ట్వీట్ చేయడం ఎందుకో? జనాల దృష్టిలో ఇలా టార్గెట్ కావడం ఎందుకో? ఇప్పుడు నిఖిల్ కాస్త మీడియం రేంజ్ హీరోగా ఎదుగుతున్నాడు. ఇలాంటి టైమ్ లో కాస్త జాగ్రత్తగా వుండాలి. లేకపోతే జనాలు ఇలాగే ఆడేసుకుంటారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?