Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిర్మాతగా బాలకృష్ణ?

నిర్మాతగా బాలకృష్ణ?

నందమూరి ఫ్యామిలీలో దాదాపు చాలామంది నిర్మాతలుగా మారిన వారే. ఏదో ఒక సినిమానో, రెండు సినిమాలనో నిర్మించిన వారే. నందమూరి బాలకృష్ణ గతంలో మాంచి పౌరాణిక సినిమా చేయాలని స్టార్ట్ చేసి, కానీ అంతలోనే అనుకోని అవాంతరం రావడంతో ఫుల్ స్టాప్ పెట్టేసారు. అంతేతప్ప, బాలకృష్ణ పూర్తిస్థాయి నిర్మాతగా మారిందిలేదు.

ఇటీవల చకచకా సినిమాలు చేస్తున్న బాలకృష్ణ, నిర్మాతగా కూడా మారే ఆలోచన చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ తనకు బాగా సన్నిహితమైన ఓ నిర్మాతతో కలిసి కొత్త బ్యానర్ స్టార్ట్ చేసి, సినిమా నిర్మాణాలు చేపడతారని ఆ గుసగుసల్లో వినిపిస్తోంది. 

బహుశా ఇది మోక్షజ్ఞ సినిమాతో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఇప్పటికే రామ్ చరణ్, మహేష్, పవన్ కళ్యాణ్, నాగార్జున లాంటి టాప్ హీరోలకు స్వంత బ్యానర్లు వున్నాయి. ఇప్పుడు బాలయ్య కూడా బ్యానర్ స్టార్ట్ చేస్తే, ఆయన కూడా అదేబాటలో పయనిస్తున్నట్లు అవుతుంది. మరి ఈ గ్యాసిప్ ఎప్పుడు నిజమవుతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?