Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిర్మాతల మండలిలో కోట్లు గోల్ మాల్?

తెలుగు సినిమా నిర్మాతల మండలిలో నిధుల గోల్ మాల్ జరిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినిమా రంగానికి చెందిన ప్రతి సంస్థ కొంతమంది గుత్తాధిపత్యంలో చిక్కకుని వున్నట్లు తరచు ఆరోపణలు రావడం గమనించాల్సిన విషయం. చాంబర్ కావచ్చు..ఎఫ్ ఎన్ సి సి కావచ్చు, మా కావచ్చు..ప్రతీ దానిపైనా ఏదో ఒక ఆరోఫణలు వున్నాయి. ప్రభుత్వం వీటిని చూసీ చూడనట్లు వదిలేస్తుంది. ఎందుకంటే రాజకీయాలు, సినిమాలు చెట్టాపట్టాలేసుకుని వుంటాయి కాబట్టి. ఇప్పుడు నిర్మాతల మండలిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు..మీడియాకు పంపించిన మెయిల్ సారాంశం ఇలా వుంది.

నిర్మాతల మండలికి వచ్చే ఆదాయం చెక్/డి.డి ల రూపంలో కాకుండా క్యాష్ గా తీసుకుంటున్న వాటిని బ్యాంక్ లో జమచేయకుండా రెండు సంవత్సరాలుగా నొక్కేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం మూడురోజుల క్రితం బయటకు పొక్కింది. సంఘం బైలా ప్రకారం ఎట్టిపరిస్థితుల్లోను ఆగస్ట్31,2015కి నిర్వహించాల్సిన వార్షిక సర్వసభ్య సమావేశం మూడు నెలలు గడచినా కూడా ఇంతవరకు ఏర్పాటు చెయ్యకుండా, ఆన్యువల్ రిపోర్టులు  పంపకుండా, కనీసం ప్రతినెలా జరగాల్సిన  ఈ సీ సమావేశం  కూడా ఏర్పాటు చెయ్యకుండా,  జరిగిన మోసం గురించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు ఎవ్వరికీ తెలియనివ్వకుండా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా కార్యవర్గం కాలయాపన చెయ్యటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

కోర్టు సాకుతో గత మూడు సంవత్సరాలుగా ‘ఎలక్షన్స్’ నిర్వహించకుండా పదవుల్లో ఉంటూ, ఆర్ధిక అవకతవకలు జరుగుతున్నందున కార్యవర్గం పదవుల నుండి వైదొలగి వెంటనే ఎన్నికలు జరిపించాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేసారు. మండలికి బ్యాంక్ లలో డిపాజిట్లలో ఉన్న 13కోట్లలో కొంత ‘డ్రా’ చేసి అధిక వడ్డీకి బయట తిప్పుకుంటున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నందున, గత రెండు సంవత్సరాల  బ్యాంకు స్టేట్ మెంట్ల కాపీలను మీడియా ముందు ఉంచాలంటున్నారు. ఇంకా సంఘ నిధులు దుర్వినియోగం అవతున్నాయని, వీటన్నింటిపైనా విచారణ అవసరం అని ఆ మెయిల్ లో కోరారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?