Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నితిన్ సినిమాకు భారీ బడ్జెట్ నా?

నితిన్ సినిమాకు భారీ బడ్జెట్ నా?

తలకు మించిన తలపాగా పనికిరాదు. త్రివిక్రమ్ లాంటి ఏస్ డైరక్టర్, సమంత లాంటి హీరోయిన్, బ్యానర్ ఇవన్నీ కలిసినా నితిన్ సినిమా 40 కోట్లు చేయడం అంటే కిందా మీదా అయిపోయింది. అలాంటిది ఇప్పుడు 14 రీల్స్ సంస్థ మీడియం రేంజ్ డైరక్టర్ హను రాఘవపూడి డైరక్షన్ లో చేయబోయే సినిమాకు భారీ బడ్జెట్ అవుతుందని టాక్. ఇప్పుడు దీన్ని ఎలా తగ్గించాలి అని కిందా మీదా అవుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

హనురాఘవపూడి ఈ సినిమాకు అందించిన స్క్రిప్ట్ ప్రకారం సినిమాలో మూడు వంతులు అమెరికాలో జరుగుతుందట. అందువల్ల బడ్జెట్ కాస్త భారీగా మారుతోందని తెలుస్తోంది. అయితే అని కథ మరీ వైవిధ్యం కాదని గుసగుసలు వినిపిస్తున్నాయి. యాక్షన్ ప్లస్ లవ్ జోనర్ కథ అని తెలుస్తోంది. యాక్షన్ ప్లస్ లవ్ జోనర్ అంటే నితిన్ ఇప్పటికి చాలా చేసాడు. 

మరి అలాంటి జోనర్ పైనే భారీ బడ్జెట్ పెట్టడం గురించి ప్రస్తుతం డిస్కషన్లు సాగుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే కొన్ని అమెరికా ఇండోర్ షాట్ లను ఇక్కడే తీసేసి, అమెరికా ఖర్చును కాస్త తగ్గించే ప్లానింగ్ చేస్తున్నట్లు వినికిడి. గతంలో ఇదే 14 రీల్స్ సంస్థ ఇదే హను రాఘవపూడితో నాని కాంబినేషన్ లో నిర్మించిన సినిమా కూడా పెద్ద ప్రాపిటబుల్ కాలేదు. అందుకే ఈసారి ముందు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?