Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నితిన్ సినిమాలో డాన్ బిల్జరియాన్

నితిన్ సినిమాలో  డాన్ బిల్జరియాన్

మన సినిమాల్లో అడపదడపా విదేశీ నటులు కనిపించడం కొత్త కాదు. కానీ కాస్త పేరున్న వాళ్లు మన సినిమాల్లో కనిపించడం తక్కువ. ఈ మధ్య ఇంటర్ నెట్ పుణ్యమా అని విదేశీ సినిమాలు, నటులు మన వాళ్లకు చేరువ అయిపోతున్నారు. అందుకే విదేశీ నటులను మన సినిమాల్లోకి రప్పిస్తే అదో క్రేజ్.

లేటెస్ట్ గా హీరో నితిన్ అదే చేసాడు. అతగాడు చేస్తున్న లేటెస్ట్ సినిమా లై. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు డాన్ బిల్జరియాన్ కూడా నటిస్తున్నాడట. ఈ విషయాన్ని నితిన్ నే స్వయంగా ట్వీట్ ద్వారా తెలిపాడు. ఒలంపస్ హాజ్ ఫాలెన్, ది ఈక్వలైజర్, వార్ డాగ్స్ లాంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించిన నటుడు ఇతను. అతగాడు తన సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగా వుందటున్నాడు నితిన్. పైగా డాన్ నటన చాలా నాచురల్ గా వుందని కితాబిచ్చాడు కూడా.

అఆ సినిమా తరువాత నితిన్ చేస్తున్న సినిమా ఇదే. హను రాఘవపూడి దర్శకుడు. 14 రీల్స్ పతాకంపై ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మూడు వంతులకు పైగా సినిమా విదేశాల్లోనే షూటింగ్ జరుపుకుంటుందీ సినిమా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?