Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నితిన్ క్లారిటీ ఇచ్చేయడం బెటరేమో?

నితిన్ క్లారిటీ ఇచ్చేయడం బెటరేమో?

టాలీవుడ్ లోని ఎలిజిబుల్ బ్యాచులర్లలో నితిన్ ఒకరు. ఇప్పడు నితిన్ ప్రేమలో పడ్డాలని టాలీవుడ్ లో గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. తన తోటి నటిని పెళ్లి చేసుకుంటానని నితిన్ ఇంట్లో చెప్పారని వదంతులు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నితిన్ ప్రేమ వ్యవహారం దాదాపు రెండు నెలలుగా వదంతులుగా వినిపిస్తోంది. కానీ ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటి గ్యాసిప్ లు కామన్ కాబట్టి. 

అయితే ఇప్పుడు ప్రేమ నుంచి పెళ్లి వరకు వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నితిన్ తన తండ్రి సుధాకర రెడ్డికి ఈ విషయం చెప్పేసారని అంటున్నారు. ఎంతవరకు నిజమో అన్నది మాత్రం తెలియదు. ఇంతకీ నితిన్ ప్రేమలో పడింది ఎవరితో అంటే, అతగాడితో తొలిసారి లై సినిమాలో నటించిన హీరోయిన్ మేఘాఆకాష్ తోనే అని వినిపిస్తోంది. అందుకే మేఘా ఆకాష్ తో వెంటనే మరో సినిమా చేస్తున్నాడు నితిన్ అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

ప్రేమలో పడినందువల్ల రెండో సినిమా చేస్తున్నారా? లేక రెండో సినిమా వరుసగా చేస్తున్నందున ప్రేమలో పడ్డారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయా? అన్నదాంట్లో క్లారిటీలేదు. కానీ ఈ వదంతి కాస్త బలంగానే వినిపిస్తున్నందున, నితిన్ లాంటి ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓ క్లారిటీ ఇచ్చేయడం మంచిదేమో? చేసుకున్నా తప్పేంకాదు. లేదూ, అలాంటిదేం లేదని, అంతా గ్యాసిప్స్ మాత్రమే అని చెప్పేసినా తప్పేంలేదు. పైగా ఈ వదంతులు తప్పుతాయి అప్పడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?