Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిత్యకి బ్రేకిస్తున్న బన్నీ

నిత్యకి బ్రేకిస్తున్న బన్నీ

సూపర్‌ టాలెంటెడ్‌ అనిపించుకున్నా, రాజమౌళిలాంటి దర్శకుల నుంచి గొప్ప గొప్ప ప్రశంసలు అందుకున్నా కానీ నిత్యా మీనన్‌ ఎప్పుడూ ఒకే స్థాయి సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్టార్‌ హీరోల సరసన ఆమెకి అవకాశాలు దక్కలేదు. మొదటిసారిగా ఆమె ఒక స్టార్‌ హీరో సినిమాలో నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది. 

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో రూపొందుతోన్న చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారనే సంగతి తెలిసిందే. సమంత, అదా శర్మ రెండు స్లాట్‌లు ఫిల్‌ చేయగా, మూడో హీరోయిన్‌ కోసం చూస్తున్నారు. ప్రణీతకి ఇందులో కూడా త్రివిక్రమ్‌ ఛాన్స్‌ ఇస్తున్నట్టు న్యూస్‌ వచ్చినా కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

అయితే ఆ మూడో హీరోయిన్‌ స్లాట్‌ నిత్యా మీనన్‌కి దక్కిందని తెలిసింది. అదే నిజమైతే నిత్య రేంజ్‌ పెరిగినట్టే. తన ఖాతాలో అలా మొదలైంది, ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందేలాంటి హిట్స్‌ ఉన్నా కానీ నిత్యా మీనన్‌ని స్టార్‌ హీరోలు ఎంకరేజ్‌ చేయలేదు. అల్లు అర్జున్‌తో నటిస్తే ఆమెకి మిగిలిన స్టార్‌ హీరోల నుంచి కూడా పిలుపు వచ్చే అవకాశముంటుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?