Advertisement


Home > Movies - Movie Gossip
సంక్రాంతికి కూడా ఫస్ట్ లుక్ లేనట్టే

డిసెంబర్ 31లేదా జనవరి 1న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని అనుకున్నారంతా. కానీ మహేష్ సినిమాకు సంబంధించి ఎలాంటి లుక్ రాలేదు. కనీసం ఈ సంక్రాంతికైనా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ మహేష్ నటిస్తున్న "భరత్ అనే నేను" సినిమాకు సంబంధించి ఈ సంక్రాంతికి కూడా ఫస్ట్ లుక్ రావడం లేదు.

సినిమా విడుదలకు చాలా టైమ్ ఉంది. ప్రస్తుతానికి ఏప్రిల్ 27ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు. కాబట్టి ఇంత త్వరగా ఫస్ట్ లుక్ విడుదల చేయడం వల్ల ఉపయోగం లేదని టీం భావిస్తోంది. అందుకే యూనిట్ అంతా సంక్రాంతిని లైట్ తీసుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. నగర శివార్లలోని శంకరపల్లిలో నిన్నటివరకు కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. టాకీ పార్ట్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత, మంచి రోజు చూసుకొని, వచ్చే నెలలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కైరా అద్వానీ హీరోయిన్ గా పరిచయమౌతోంది. మూవీకి సంబంధించి రీసెంట్ గా సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ తప్పుకోవడంతో, అతడి స్థానంలో తిరును తీసుకున్న విషయం తెలిసిందే.