Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ సినిమా 9న షురూ?

ఎన్టీఆర్ సినిమా 9న షురూ?

జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తరువాత ఎన్టీఆర్ మరో సినిమా స్టార్ట్ చేయకుండా వుండిపోవడం అభిమానులనే కాదు, అతని సినిమాలు ఇష్టపడేవారిని కూడా కాస్త బాధించింది. మిగిలిన హీరోల మాదరిగా కాకుండా, ప్లాన్ లేకుండా, డైరక్టర్ లను ఆప్షన్ లో వుంచుకోకుండా ఎన్టీఆర్ చాలా తప్పు చేసాడని, చేస్తున్నాడని వార్తలు వెలువడ్డాయి. కానీ ఎన్టీఆర్ సమస్య ఎన్టీఆర్ ది. 

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎలాంటి సినిమా వుండాలి. ఏ రేంజ్ సినిమా వుండాలి. అందుకు తగ్గ కథ కావాలి. ఆఖరికి డైరక్టర్ బాబి అలాంటి కథ అందించాడని, దాన్నే ఎన్టీఆర్ తన తరువాత ప్రాజెక్టు గా ఓకె చేసాడని గ్రేట్ ఆంధ్ర ముందే వెల్లడించింది. ఇప్పుడు ఆ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్.

ఈ సినిమాకు పూజ కార్యక్రమం ఈనెల 9న జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9 దశమీ శుక్రవారం మంచి ముహుర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ మర్నాడు అంటే 10 వ తేదీ నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూట్ వుండొచ్చు. అందుకోసం ఏర్పాట్లు చకచకా చేయాలని బాబి-ఎన్టీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరి స్టార్ కాస్ట్, హీరోయిన్, టెక్నీషియన్ల సంగతి ఏమిటో? 10 నుంచి మరి ఏం షూట్ చేస్తారో తెలియాల్సి వుంది. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తారు. 

మొత్తానికి కాస్త ఆలస్యమైనా ఎన్టీఆర్ పాజెక్టు స్టార్ట్ అవుతోందంటే అభిమానులకు ఆనందమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?