Home > Movies - Movie Gossip
ఎన్టీఆర్ సినిమా పైకి బాలయ్య సినిమా?

ఈ సారి దసరా చాలా హాట్ గా వుండబోతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, మహేష్, బాలకృష్ణల సినిమాలు ఒకేసారి దసరాకు సందడి చేయబోతున్నాయి. దసరాకు ఓ వారం ముందుగా ఎన్టీఆర్ సినిమా, దసరా రోజుల్లో మహేష్, బాలకృష్ణల సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

అయితే పోటీ ఎందుకు? అని బాలయ్య సినిమా రెండు రోజులు వెనక్కు వెళ్లి అక్టోబర్ ఒకటిన వస్తుందని వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ అర్థం లేని వార్తలని, అసత్యాలని అంటోంది బాలయ్య పైసా వసూల్ యూనిట్.

ఆరు నూరైనా, నూరు ఆరైనా అనుకున్న డేట్ కే పైసా వసూల్ సినిమా విడుదల వుంటుదట. అసలు ఆ మాటకు వస్తే సెప్టెంబర్ 21, 22 తేదీల్లో కి బాలయ్య సినిమాను విడుదల చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారట.

ఈ నెల 22తో పైసా వసూల్ షూట్ వర్క్ అంతా పూర్తయిపోతుంది. అక్కడి నుంచి నెల రోజులు సమయం వుంది పోస్ట్ ప్రొడక్షన్ కు. మహా అయితే పదిహేను రోజులు చాలని, ఇప్పటికే చాలా వరకు వర్క్ సమాంతరంగా ఫినిష్ చేసామని, సెప్టెంబర్ 15కు ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందనీ అంటున్నారు.

అందువల్ల ఒకటి రెండు రోజుల్లో ఎగ్జిబిటర్లు, బయ్యర్లతో మాట్లాడి అవసరం అయితే వారం ముందుగానే విడుదల చేసే విషయమై డిస్కస్ చేస్తారట. వాళ్లు ఓకె అంటే 21, లేదా 22న విడుదల చేసేస్తారు. కాదూ అంటే అనుకున్న డేట్ కే వస్తారు. అంతే కానీ వెనక అడుగు మాత్రం వుండదట.