Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ - దేవీ మధ్యలో త్రివిక్రమ్

ఎన్టీఆర్ - దేవీ మధ్యలో త్రివిక్రమ్

దేవీ శ్రీ ప్రసాద్ అంటే చాలా ఇష్టమే త్రివిక్రమ్ కు. అత్తారింటికి దారేది సినిమాలో ఏకంగా ఓ పాటలో ఫుల్ లెంగ్త్ లో చూపించాడు. అలాంటిది అ..ఆ సినిమాకు పక్కన పెట్టాడు. అజ్ఞాతవాసికి అనిరుధ్ ను తెలుగుకు పరిచయం చేసాడు. పరిచయం చేయడమే కాదు, వీలయినంత ఎలివేట్ చేసే ప్రయత్నం చేసాడు. దాంతో దేవీకి త్రివిక్రమ్ కి మధ్య ఏదో అయిపోయిందని చాలా చాలా వార్తలు పుట్టుకు వచ్చాయి.

త్రివిక్రమ్ మాట కొట్టేయలేడు కాబట్టి పవన్ కూడా దేవీని పక్కన పెట్టాడని లేదంటే, అన్ని హిట్ లు ఇచ్చిన వాడిని వదులుకోడని గుసగుసలు వినిపించాయి. దానికి తోడు ఎన్టీఆర్ సినిమాకు కూడా అనిరుధ్ నే మ్యూజిక్ డైరక్టర్ గా ప్రకటించారు. దాంతో త్రివిక్రమ్ తన చాయిస్ ను దేవీ నుంచి మార్చుకున్నాడన్నది క్లియర్ అయిపోయింది.

అయితే అజ్ఞాతవాసి ఆడియో చూసిన తరువాత ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన ప్రారంభమైంది. అనిరుధ్ ఇలాంటి ఆడియో ఇస్తే, డ్యాన్స్ లు విరగదీసే ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటని? ఇఫ్పడు ఎన్టీఆర్ క్యాంప్ లో డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి. ప్రాజెక్టులోంచి అనిరుధ్ ను తప్పిస్తే బాగుండును, దేవీని రప్పిస్తే బాగుండును అని. 

దేవీశ్రీప్రసాద్ కు ఎన్టీఆర్ మాంచి అనుబంధం వుంది. ఎన్టీఆర్ అడిగితే దేవీ మరోమాట చెప్పడు. అది పక్కా. కానీ త్రివిక్రమ్ సంగతేమిటి? అనిరుధ్ పేరు ప్రకటించి, పక్కన పెడతాడా? అసలు దేవీతో ఏమయింది? అన్నది విషయం.

నిజానికి దేవీశ్రీప్రసాద్ కు త్రివిక్రమ్ కు మధ్య పెద్ద పంచాయతీ ఏమీ లేదట. దేవీశ్రీ ప్రసాద్ చాలా అంటే చాలా బిజీ అయిపోవడమే అసలు కారణం అని తెలుస్తోంది. దీంతో అతని డేట్ల కోసం వెయిట్ చేయడం, చెన్నయ్ వెళ్లి పడిగాపులు పడడం, టైమ్ కు వర్క్ పూర్తి కాకపోవడం వంటివి, తివిక్రమ్ ను ఫీలయ్యేలా చేసాయని తెలుస్తోంది. ఈ టెన్షన్లు తట్టుకోలేకే వేరే ఆప్షన్ చూసుకున్నాడు.

అయితే అనిరుధ్ కూడా తక్కువేమీ కాదు. అ..ఆ టైమ్ లో చేస్తానని, ఎంతకీ రాకపోవడంతో, విక్కీ జే మేయర్ దగ్గరకు వెళ్లాడు. కానీ అనిరుధ్ సారీ, అని చేస్తానని అనేసరికి, ఇచ్చిన అడ్వాన్స్ వుంది కదా అని పవన్ సినిమాకు తీసుకున్నారు. కానీ ఆడియో చూస్తే అలా వుంది.

అయితే ఇందులో అనిరుద్ ఫాల్ట్ కన్నా త్రివిక్రమ్ ఫాల్ట్ ఎక్కువ అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. సిట్యువేషన్ సెట్ అయిన మూడు పాటలు బాగా చేసాడు. కావాలని శాస్త్రీయ కీర్తనలు, అలాంటి నేపథ్య సంగీతం చేయిస్తే అనిరుధ్ మాత్రం ఏం చేస్తాడుఅని వాదనలు వినిపిస్తున్నాయి. పైగా అనిరుధ్ చేసిన ఆల్బమ్ ల్లో మేజర్ హిట్ లే వున్నాయి కదా అంటున్నారు.

కానీ ఎన్టీఆర్ యూనిట్ మాత్రం తమ సినిమాకు దేవీ అయితే బెటర్ అన్న ఆలోచనలో వుంది. అయితే త్రివిక్రమ్ కు ఎవరు చెప్పగలరు. ఒక్క ఎన్టీఆర్ తప్ప? ఎన్టీఆర్ పట్టుబడితే కాదనకపోవచ్చు. అయితే దేవీ మాత్రం ఊ అంటాడా? అనిరుధ్ ను అంతలా ప్రొజెక్ట్ చేసిన తరువాత సహజంగా తేడా వస్తుంది కదా? వ్యవహారం.

అందువల్ల స్మూత్ గా నో చెప్పి తప్పుకుంటాడేమో? అలా అడిగిన తరువాత తప్పుకుంటే మళ్లీ త్రివిక్రమ్ ఫీలయ్యే అవకాశం వుంది. అందువల్ల దేవీ పక్కాగా ఓకె అంటాడన్నది తెలుసుకునే త్రివిక్రమ్ ను ఒప్పించాలి. తీరా అలా చేసినా, త్రివిక్రమ్ నో అంటే మళ్లీ సమస్యే.

ఇలా చిక్కుముడులు పడిన ఈ విషయాన్ని ఇలాగే వదిలేయడం బెటరేమో అన్న సూచనలు కూడా వినిపిస్తున్నాయి. అనిరుధ్ తో చేయించుకోగలిగితే బాగానే చేస్తాడు. విక్కీతో మాంచి అల్బమ్ తీసుకున్న త్రివిక్రమ్ అనిరుధ్ తో ఎందుకు తీసుకోలేకపోయాడు? అంటే అజ్ఞాతవాసి కథ, కథనాలపై చూపించిన వ్యవహార శైలినే ఆడియో విషయంలో కూడా చూపించి వుంటారు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?