Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్‌ కోసి పారేసాడట!

ఎన్టీఆర్‌ కోసి పారేసాడట!

ప్రస్తుతం ఆల్‌టైమ్‌ స్లంప్‌ ఎదుర్కొంటున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ తన సినిమాల విషయంలో తప్పులెక్కడ జరుగుతున్నాయనేది ఎనలైజ్‌ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా తన సినిమాలకి కాస్ట్‌ కటింగ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాడట. తన చిత్రాలకి ఖర్చు బాగా ఎక్కువవుతోందని, దీని వల్ల సినిమా యావరేజ్‌గా ఆడినా కానీ నష్టాలు వస్తున్నాయని గ్రహించాడట. 

ఇందులో భాగంగానే తన పారితోషికం తగ్గించుకోవడానికి కూడా ఎన్టీఆర్‌ సిద్ధ పడుతున్నాడట. వీలయినంత వరకు సెట్లు తగ్గించడం, విదేశాల్లో చిత్రీకరణ లేకుండా చూసుకోవడం వంటివి ఇంప్లిమెంట్‌ చేస్తే ఖర్చు భారీగా తగ్గుతుందని గుర్తించాడట. తన నిర్మాతలు నష్టపోకుండా చూడాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చేటట్టుగా ప్లాన్‌ చేసుకోవాలని ఎన్టీఆర్‌ భావిస్తున్నాడు. 

పారితోషికం తగ్గించుకునే ట్రెండ్‌ ఎన్టీఆర్‌ స్టార్ట్‌ చేసినట్టయితే మిగతా హీరోలు కూడా ఆ దిశగా అడుగులు వేయవచ్చు. తద్వారా నష్టాలు తగ్గించి, అధిక లాభాలు సాధించడానికి మార్గం సుగమం కావచ్చు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?