Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ కు ఎనిమిది కోట్లు?

ఎన్టీఆర్ కు ఎనిమిది కోట్లు?

బిగ్ బాస్. ఒక్క సీజన్. ఎనిమిది కోట్లు. ఇదీ ఎన్టీఆర్ కు స్టార్ మా నుంచి వచ్చిన ఆఫర్. స్టార్ మా టీవీ సమర్పించే బిగ్ బాస్ కార్యక్రమం ఒక్క సీజన్ ను హోస్ట్ చేసినందుకు ఎన్టీఆర్ దాదాపు ఏడు నుంచి ఎనిమిది కోట్లు మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అగ్రిమెంట్ సైన్ కాలేదు. అది సైన్ అయిన తరువాత అసలు విషయం బయటకు వస్తుంది.

మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి చిరంజీవి 4 కోట్ల వరకు ఇచ్చారని వినికిడి. అది కూడా ఒక్క సీజన్ కు కాదు. కానీ ఎన్టీఆర్ కు ఒక్క సీజన్ కే ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీవీకి సంబంధించినంత వరకు ఇది చాలా పెద్ద మొత్తమే.

ఒక సినిమాకు ఎన్టీఆర్ 15 కోట్ల వరకు పారితోషికం వుంటుంది. అలాంటిది జస్ట్ ఓ సీజన్ టీవీ షొ అంటే మహా అయితే పది ఎపిసోడ్ లు కూడా వుండవు. దానికి ఇంత మొత్తం అంటే క్రేజీడీల్ నే.

తెరవెనుక చిరు-నాగ్

మా టీవీ స్టార్ చేతిలోకి వెళ్లిపోయినా, దానితో నాగ్, చిరంజీవిలకు మంచి సంబంధాలు వున్నాయి. అందుకే మీలో ఎవరు కోటీశ్వరుడు షో ను చిరు కావాలని అనుకుని మరీ చేయగలిగారు. ఇప్పుడు బిగ్ బాస్ షో కు తెలుగులో ఎవర్ని తీసుకుంటే బాగుంటుంది అన్న పాయింట్ దగ్గర నాగ్, చిరు ఇద్దరూ ఎన్టీఆర్ పేరు సూచించినట్లు తెలుస్తోంది. చిరు, నాగ్ లకు ఇద్దరికీ ఎన్టీఆర్ సన్నిహితుడు. మా టీవీ నుంచి అవార్డును కూడా గతంలో ప్రత్యేకంగా అందించిన సంగతి గుర్తున్నదే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?