Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ లవకుశ తరువాత

ఎన్టీఆర్ లవకుశ తరువాత

ఎన్టీఆర్ మూడు హెవీ క్యారెక్టర్లు వేసి, జై లవకుశ సినిమాను జనం ముందుకు తేవడానికి రెడీ చేసాడు. మరో వారం, పది రోజుల్లో ఎన్టీఆర్ ఫ్రీ అయిపోతాడు. ఆ తరువాత ఎన్టీఆర్ కార్యక్రమం ఏమిటి? ఈ విషయమే ఆయన అభిమానులకు ఆసక్తికరం.

ఫస్ట్ ఎన్టీఆర్ చేయబోతున్న పని యూరప్ వెళ్లడం. అక్కడి డీ టాక్సినేషన్ సెంటర్ లో నెలరోజులు థెరపీ చేయించుకోవడం. ఈ మధ్య ఈ డీటాక్సినేషన్ అన్నది అంటే శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగిచుకోవడం అన్నది అలవాటుగా మారుతోంది సెలబ్రిటీలకు.

మహేష్ బాబు ఏడాదికి ఓసారి మలేషియాకు వెళ్తుంటాడు ఇందుకొసమే. ఇలా మరి కొంతమంది కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ యూరప్ వెళ్తున్నాడు.

యూరప్ లో నెలరోజులు వున్న తరువాత మలేషియా వెళ్తాడు. మలేషియాలో ఎన్టీఆర్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే పని పెట్టుకున్నాడు. అక్కడ నెలరోజులు వుండబోతున్నాడు. ఇకపోతే త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ మారిపోతోంది. బృందావనం సినిమాలో ఎన్టీఆర్ ఎలా అయితే చిన్న, సన్నటి మీసంతో, యంగ్ లుక్ లో, అందంగా కనిపించాడో, అలా కనిపించబోతున్నాడు. ఈ సినిమా జనవరి 23 లేదా 24న ప్రారంభమయ్యే అవకాశం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?