Home > Movies - Movie Gossip
చైతూ-సమంత పెళ్లికి అతిథిగా ఎన్టీఆర్

వచ్చేనెల 6న గోవాలో పెళ్లి చేసుకోబోతున్నారు నాగచైతన్య-సమంత. పెళ్లికి ఇండస్ట్రీ నుంచి చాలా కొద్దిమంది మాత్రమే వెళ్తున్నారు.. కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఎటెండ్ అవుతున్నారు. అయితే ఈ ఫ్రెండ్స్ లిస్ట్ లో కూడా చాలా సెలక్టివ్ గా ఉన్నాడు నాగచైతన్య. తనకు అత్యంత సన్నిహితులైన వాళ్లను మాత్రమే గోవా వరకు ఆహ్వానించాలని ఫిక్స్ అయ్యాడు.

ఈ మేరకు ఇప్పటికే ఓ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాడు. వాళ్ల కోసం ప్రత్యేకంగా వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించడం లేదు నాగచైతన్య. వ్యక్తిగతంగా ఫోన్ చేసి లేదా కలిసి పెళ్లికి ఆహ్వానించాలనుకుంటున్నాడు. ఈ లిస్ట్ లో అందరికంటే ముందున్నాడు రానా. నిజానికి రానా, నాగచైతన్య బంధువులే. కానీ బ్లడ్ రిలేషన్ కంటే వీళ్లిద్దరి మధ్య స్నేహ బంధమే ఎక్కువ. అందుకే రానాను వ్యక్తిగతంగా ఆహ్వానించబోతున్నాడు చైతూ.

రానా తర్వాత నాగచైతన్యకు అత్యంత ఆప్తుడు ఎన్టీఆర్. రానా, ఎన్టీఆర్ మాత్రమే తనకు టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చిన నాగచైతన్య.. గోవాలో వివాహానికి ఎన్టీఆర్ ను ఆహ్వానించే అవకాశముంది. వీళ్లతో పాటు అల్లు శిరీష్, నితిన్ కూడా నాగచైతన్యకు క్లోజ్. కాకపోతే వాళ్లను పెళ్లికి పిలుస్తాడా లేక రిసెప్షన్ కే పరిమితం చేస్తాడా అనేది చూడాలి.

అటు సమంత కూడా గోవాలో పెళ్లికి తన క్లోజ్ ఫ్రెండ్స్ ను మాత్రమే ఆహ్వానిస్తోంది. టాలీవుడ్ నుంచి హీరోయిన్లు ఎవరికీ సమంత నుంచి పిలుపు అందే ఛాన్స్ లేదని తెలుస్తోంది. స్టయిలిస్ట్ నీరజ కోన మాత్రం గోవా వెళ్తుంది. ఎందుకంటే ఆమె కేవలం సమంతకు ఫ్రెండ్ మాత్రమే కాదు, ఆమెకు వ్యక్తిగత స్టయిలిస్ట్ కూడా. హీరోయిన్లకు సంబంధించి రకుల్, రెజీనా పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి.