Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ కు ఎన్టీఆరే పోటీనా?

ఎన్టీఆర్ కు ఎన్టీఆరే పోటీనా?

సాధారణంగా సినిమా అంటే వీకెండ్ పై ఎక్కువ హోప్ వుంటుంది. అందునా ఫస్ట్ వీకెండ్ అంటే మరీనూ. అలాంటిది జైలవకుశ లాంటి సినిమాకు ఎంత క్రేజ్ వుంటుంది. కానీ ఈ శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ జైలవకుశకు ఎన్టీఆర్ నే పోటీ కాబోతున్నాడు.

జై లవకుశకు క్రేజ్ రావడంతో స్టార్ మా రియాల్టీ షో బిగ్ బాస్ పాత్ర తక్కువదేమీ కాదు. గత 10వారాలుగా బిగ్ బాస్ షో తెలుగు ఇళ్లకు సుపరిచితమైపోయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ కనిపించే శని, ఆది వారాలు జనాలు టీవీకి అంటుకుపోతున్నారు. 

ఈ శని, ఆదివారాలు బిగ్ బాస్ షో లో కీలకం. ఈ రెండు రోజులే ఆఖరి ఎపిసోడ్ లు వుంటాయి. పైగా శనివారం షో కు ఎన్టీఆర్ రావడమే కాకుండా, ఇప్పటి దాకా బిగ్ బాస్ షో లో కనిపించిన 14మంది పార్టిసిపెంట్స్ కనిపించబోతున్నారు. సో, కచ్చితంగా ఆ క్రేజ్ కొంత వుంటుంది. ఇక ఆదివారం అయితే మరీనూ.

ఆ రోజే అసలైన ఎపిసోడ్. మిగిలిన బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో ఎవరు విజేతగా నిలుస్తారో? ఎవరు యాభై లక్షలు ప్రయిజ్ మనీ గెలుపొందుతారో అన్న ఉత్కంఠ వుండనే వుంది. కోట్ల మంది బిగ్ బాస్ షో కి ఓట్లు వేస్తున్నారు అంటే ఆ క్రేజ్ ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు.

అందువల్ల ఈ బిగ్ బాస్ షో ఎఫెక్ట్ శని, ఆది వారాల్లో జై లవకుశ ఫస్ట్ అండ్ సెకెండ్ షో ల మీద పడే అవకాశం వుంది. ఆ రెండు రోజులు కలిసి జైలవకుశ 15 నుంచి 20కోట్ల మేరకు షేర్ తెచ్చుకోవాలి. అలా అయితే ఫస్ట్ వీకెండ్ 50కోట్ల షేర్ వచ్చినట్లు అవుతుంది. లేదూ అంటే తగ్గే ప్రమాదం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?