Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఒక మనసు... అయిదు కోట్లు ఖర్చు

ఒక మనసు... అయిదు కోట్లు ఖర్చు

కొణిదెల నీహారిక..నాగ శౌర్య జంటగా, రామ రాజు డైరక్షన్లో టవీ-9, మధురశ్రీధర్ నిర్మించిన సినిమా ఒక మనసు. ఈ సినిమాకు ప్రీ పబ్లిసిటీ అద్భుతంగా వచ్చింది. అయితే నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇంతకీ ఫినాన్షియల్ గా పరిస్థితి ఏమిటి? అన్నది పాయింట్. ఈ సినిమాను ఓవర్ సీస్ తో కలిపి 5.05 కోట్లకు అమ్మారు. తొలి మూడు రోజులు కలిపి 1.75 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మండే మల్టీ ఫ్లెక్స్ లో ఒకె కానీ సింగిల్ థియేటర్లు డ్రాప్ అయ్యాయి. 

అయితే మండే డ్రాప్ అన్నది మామూలే. మంగళవారం ఎలా వుంటుదన్నది టాలీవుడ్ ఎప్పుడూ చూసే సంగతి. అందువల్ల రేపు చూడాల్సి వుంది. మొత్తం అన్ని ఏరియాలు కలిపి అయిదు కోట్లు సేల్ అంటే, మరీ పెద్ద మొత్తం కాదు..విడివిడిగా చూసుకుంటే లక్షల్లోనే. సో రికవరి ఎలా వున్నా, లాస్ మరీ భయంకరంగా వుండదు..ఆ రేంజ్ లోనే వుంటుంది.  

అయితే నిర్మాతలకే ఎక్కువ లాస్ వుండేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాను మధుర శ్రీధర్, టీవీ 9 ఇంకా మరో ఇద్దరు కలిసి నిర్మించారు. తలా కోటి పాతిక వరకు పెట్టారు. సినిమా మేకింగ్ కే మూడు కోట్లు దాటింది. కాస్టింగ్ పారితోషికాలు రెండు వరకు అయ్యాయి. సో..వచ్చింది..ఖర్చయింది సరిపోయింది. 

ఇన్నాళ్లు శాటిలైట్ మీద ఆశ పెట్టుకున్నారు. అదే లాభంగా మిగులుతుందని. అయితే రిలీజ్ కు ముందు రెండున్నర వరకు జెమినితో బేరాలు సాగాయి. మరి, నెగిటివ్ సమీక్షలు వచ్చిన నేపథ్యంలో ఈ రేటు ఏ మేరకు తగ్గుతుందన్నది చూడాలి. అలా శాటిలైట్ మీద వచ్చిందే ఆ నలుగురు నిర్మాతలకు మిగిలేది..లేదూ అంటే తొమ్మిది నెలల కృష్టం వృధానే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?