Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్-కొరటాల సినిమాకు మరో డేట్

 మహేష్-కొరటాల సినిమాకు మరో డేట్

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో రెండో సినిమాకు కొబ్బరికాయ కొట్టి  చాన్నాళ్లయింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు. రెండు సార్లు డేట్స్ ఎనౌన్స్ చేసినప్పటికీ ఆ టైమ్ కు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం సాధ్యం కాలేదు. "భరత్ అనే నేను" మూవీకి సంబంధించి తాజాగా మరో డేట్ ఫిక్స్ చేశారు. వచ్చేనెల 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారట.

ఈసారి మాత్రం ఈ తేదీకి ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే మహేష్ తో సంబంధం లేకుండానే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ కైరా అద్వాణితో పాటు మరికొందరు నటీనటులతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించారు. మహేష్ మాత్రం జూన్ నుంచి సెట్స్ పైకి వస్తాడు.

ప్రస్తుతం స్పైడర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మహేష్. అనుకున్న టైమ్ కంటే ఈ సినిమా షూటింగ్ కు ఇంకాస్త ఎక్కువ టైం పడుతోంది. అందుకే కొరటాలతో చేయాల్సిన ప్రాజెక్టు లేట్ అవుతూ వస్తోంది.

నిజానికి తన సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను లండన్ లో ప్లాన్ చేశాడు కొరటాల. కానీ మహేష్ అందుబాటులోకి రాకపోవడంతో హైదరాబాద్ లోనే ఇతర నటీనటులతో సన్నివేశాలు తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ఫైనలైజ్ చేసిన విషయం తెలిసిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?