Advertisement


Home > Movies - Movie Gossip
2.0కు సంబంధించి మరో వాయిదా

లెక్కప్రకారం మరో 10రోజుల్లో హైదరాబాద్ లో టీజర్ రిలీజ్ జరగాలి. కానీ ఈనెల 22న నిర్వహించాలనుకున్న టీజర్ రిలీజ్ కార్యక్రమం వాయిదాపడనట్టు తెలుస్తోంది. 2.0సినిమాకు సంబంధించి ఇప్పటికే దుబాయ్ లో గ్రాండ్ గా ఆడియో రిలీజ్ చేశారు. టీజర్ ను హైదరాబాద్ లో, ట్రయిలర్ ను చెన్నైలో లాంచ్ చేయాలనుకున్నారు. 

కానీ 22న జరగాల్సిన టీజర్ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ అయింది. త్వరలోనే మరో తేదీని ప్రకటించబోతున్నారు. కేవలం టీజర్ మాత్రమే కాదు.. ట్రయిలర్ రిలీజ్ ను కూడా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న 2.0 ట్రయిలర్ ను విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఆ కార్యక్రమం కూడా ఉండకపోవచ్చు.

తాజా వాయిదాలతో జనవరి 25కి ఈ సినిమా రాదనే విషయం దాదాపు స్పష్టమౌతోంది. గ్రాఫిక్స్ వర్క్ లేట్ అవుతుండడంతో.. సినిమా విడుదల వాయిదాపడింది. దీంతో టీజర్, ట్రయిలర్ రిలీజ్ కార్యక్రమాల్ని కూడా పోస్ట్ పోన్ చేశారు.