Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇదిగో రీమేక్.. అదిగో వెంకటేశ్!

ఇదిగో రీమేక్.. అదిగో వెంకటేశ్!

సినిమాలు చేయకపోయినా వెంకీపై రూమర్లకు మాత్రం కొదవలేదు. ఇదిగో రీమేక్ అంటే అదిగో వెంకటేశ్ టైపులో వెంకీపై పుకార్లు హల్ చల్ చేస్తుంటాయి. రీమేక్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ సీనియర్ నటుడు హిందీలో హిట్ అయిన ఓ సినిమాపై మనసు పడ్డాడంటూ తాజాగా మరికొన్ని కథనాలు పుట్టుకొస్తున్నాయి.

బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సుల్తాన్ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాల్లో వెంకీ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సుల్తాన్ సినిమా రెజ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. 

ఇలాంటి క్యారెక్టర్ చేసే స్టామినా మన వెంకీకి కూడా ఉంది. 56 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోస్ కు ఏమాత్రం తీసిపోని విధంగా కండలు పెంచి దిట్టంగా ఉంటాడు వెంకటేశ్. కేవలం కుస్తీ చేయడమే కాకుండా సుల్తాన్ లో ఉండే ఎమోషన్ ను యాజ్ ఇటీజ్ గా పండించేంత టాలెంట్ కూడా ఉంది.  

సో.. సుల్తాన్ సినిమాను వెంకీ రీమేక్ చేస్తాడనే రూమర్ నమ్మేటట్టుగానే ఉంది. ఎటొచ్చి ఈ సినిమా రీమేక్ రైట్స్ మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ దక్కించుకోలేదు. తమిళ రీమేక్ రైట్స్ మాత్రం అమ్ముడుపోయాయి. 

మరోవైపు వెంకీ ఖాతాలో ఇప్పటికే చాలా కథలు, దర్శకులున్నారు. పూరి జగన్నాథ్, క్రిష్ లాంటి దర్శకుల పేర్లు లిస్ట్ లో ఉన్నాయి. విక్రమ్ వెథ లాంటి రీమేక్ స్టోరీలు, ఓ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ స్టోరీ కూడా వెంకీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు సుల్తాన్ రీమేక్ కూడా వచ్చి చేరింది. గురు మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకీ.. వీటిలో దేనికి ఓటేస్తాడో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?