Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నంది రచ్చ: జాగ్రత్త గుణశేఖర్

నంది రచ్చ: జాగ్రత్త గుణశేఖర్

నందుల రచ్చ వ్యక్తిగత కక్షలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈసారి కులాల కుమ్ములాటలు కూడా చేరిపోయాయి ఈ రగడలోకి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. నందులు ఎవరికి వెళ్లాలో వాళ్లింటికి వెళ్లిపోయాయి. నష్టం ఎవరికి జరగాలో వాళ్లకు జరిగిపోయింది. ఫైనల్ గా ఈ మొత్తం ఎపిసోడ్ లో బలిపశువు గుణశేఖర్.

ఆవేశం ఆపుకోలేక, మనసు చంపుకోలేక మీడియా ముందుకొచ్చాడు గుణశేఖర్. అతడి ఆవేశంలో అర్థం ఉంది. ఆయన ఆక్రోషం చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. కానీ ఇవన్నీ ఈ 3రోజులే. రాబోయే రోజుల్లో గుణశేఖర్ కు చుక్కలు కనిపించడం ఖాయం. ఈ మేరకు వ్యూహరచన సిద్ధమైనట్టు తెలుస్తోంది.

గుణశేఖర్ కు ఎలా చెక్ పెట్టాలో ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది ఓ సెక్షన్. అతడికి వ్యతిరేకంగా చాలా క్లిప్పింగులు, బైట్స్ రెడీ చేస్తోంది. రేపోమాపో వీటిని దశలవారీగా సోషల్ మీడియాలో విడుదలచేయబోతోంది. ఒక విధంగా చెప్పాలంటే గుణశేఖర్ ను ఓ వారం రోజుల పాటు ఉక్కిరిబిక్కిరి చేయాలనేది ప్లాన్.

ఇది కేవలం మొదటి దశ ప్రణాళిక మాత్రమే. తర్వాత అతడి సినిమాలపై కూడా నందుల ఎఫెక్ట్ పడనుంది. ఎలా చూసుకున్నా రాబోయే రోజుల్లో గుణశేఖర్ కు ఇండస్ట్రీలో కాస్త కష్టమే. మరీ ముఖ్యంగా కొంతమంది హీరోలు, నిర్మాతలతో గుణశేఖర్ ఇక సినిమాలు చేయలేడేమో. సొంతంగా నిర్మించిన సినిమాలను రిలీజ్ చేసే విషయంలో కూడా అతడికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.

ఇవన్నీ గుణశేఖర్ కు తెలియనవి కావు. భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతాయని ఊహించి, అన్నింటికీ తెగించే మీడియా ముందుకొచ్చాడు ఈ దర్శకనిర్మాత. అయితే గుణశేఖర్ ఊహించిన దానికంటే కాస్త పెద్ద షాకే అతడికి తగిలే ప్రమాదముంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?