Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఔరా.. సునీల్.. సైరా?

ఔరా.. సునీల్.. సైరా?

మీడియా ముచ్చట ఒక్కోసారి భలేగా వుంటుంది.

 ‘సై రా సినిమాలో కమెడియన్ గా అవకాశం వస్తే చేస్తారా’ ఇదీ క్వశ్చను.

‘ఒకసారి అవకాశం మిస్ అయింది. అన్నయ్య సినిమాలో చేయడం. ఈసారి అవకాశం రావాలే కానీ, వదులుకునే ప్రసక్తే లేదు’ ఇదీ కమెడియన్ ప్లస్ హీరో సునీల్ సమాధానం.

కానీ దానికి ఏం జరిగింది. సైరా సినిమాలో సునీల్ వున్నాడు అని కొందరు, సైరా సినిమాకు సునీల్ అగ్రిమెంట్ చేసాడని మరి కొందరు కథలు అల్లేసారు. అలా అలా వార్తలు పుట్టుకువచ్చేసాయి.

అసలే సినిమా రంగంలో ఇగో సమస్యలు ఎక్కువ. మనం చెప్పకుండా వాళ్లు చెబుతారా? అనే వ్యవహారం వుంటుంది. ఆలూ లేదు, చూలూ లేదు, సైరా లో సునీల్ ఏమిటీ అని, ఇప్పుడు సైరా యూనిట్ కు కోపం వచ్చేసినట్లు తెలుస్తోంది.

చిరు సన్నిహితులు ఈ మేరకు ఏం జరిగింది, అసలు సునీల్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్నది ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీంతో సునీల్ వివరణ ఇచ్చినట్లు బోగట్టా. తను అగ్రిమెంట్ చేసానని, సినిమా చేస్తున్నానని చెప్పలేదని, అవకాశం వస్తే వదలను అని మాత్రమే చెప్పానని సునీల్ వివరించినట్లు బోగట్టా. దాంతో సైరా యూనిట్ మరి శాంతించిందో లేదో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?