Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మళ్లీ వాయిదా: కొనసాగుతున్న కష్టాలు

మళ్లీ వాయిదా: కొనసాగుతున్న కష్టాలు

ఎప్పుడో థియేటర్లలోకి రావాల్సిన ఆక్సిజన్ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఆగస్ట్ 18న థియేటర్లలోకి వస్తుందనుకున్న ఈ సినిమా అప్పట్నుంచి నెలకోసారి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. తాజాగా ఈనెల 27న వస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్.. ఇప్పుడు ఆ డేట్ నుంచి కూడా వెనక్కి తగ్గారు. 

గోపీచంద్ హీరోగా నటించిన ఆక్సిజన్ సినిమాను కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. చాలా రోజులుగా బిజినెస్ ఓపెన్ చేసి పెట్టినప్పటికీ.. దర్శకుడు జ్యోతికృష్ణ పెట్టించిన ఖర్చుకు, బయ్యర్లు చెబుతున్న ఎమౌంట్ కు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అందుకే ఈ సినిమాను తాజాగా మరోసారి వాయిదావేశారు. అక్టోబర్ 27న రావాల్సిన ఆక్సిజన్ ను నవంబర్ 10కి వాయిదావేశారు. 

రాశిఖన్నా, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్ర పోషించాడు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?