Advertisement


Home > Movies - Movie Gossip
ఆక్సిజన్ విడుదల డవుట్ అంట

ఎప్పుడో ప్రారంభమైంది గోపీచంద్ సినిమా ఆక్సిజన్ అంటూ. రెండు అడుగులు, మూడు అడుగులు వెనక్కు వేస్తూ నడుస్తోంది. ఒక స్టేజ్ లో గోపీచంద్ ఈ సినిమాను వదిలేసి, సంపత్ నంది సినిమాపైకి వెళ్లిపోయి, అది చకచకా ఫినిష్ చేసాడు. ఆ తరువాత మళ్లీ దీనికి డేట్లు ఇచ్చి దాదాపు కంప్లీట్ చేసారు.

ఇప్పుడే మే లో విడుదల అంటూ నోట్ కూడా ఇచ్చారు. అయితే అది డవుట్ అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం మరేమీ కాదట. హీరో,హీరోయిన్ల పేమెంట్ల విషయంలో కొంచెం తకరారు జరుగుతోందని టాక్. పేమెంట్లు పెండింగ్ లో వుండడంతో డబ్బింగ్ లు చెప్పడం ఆపేసినట్లు తెలుస్తోంది. హీరో గోపీ చంద్ కు కోటి రూపాయిలకు పైగా నిర్మాత బకాయి వున్నారని, అందుకే ఆయన డబ్బింగ్ ఆపారని వినికిడి. 

ఇధిలా వుంటే హీరోయిన్ రాశీఖన్నా కు కూడా రెమ్యూనిరేషన్ బకాయి వున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ లెక్కన ఈ సినిమా మేలో విడుదల అన్నది డవుట్ గా వుంది.