Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పైసా వసూల్ సెన్సార్ కు రెడీ

పైసా వసూల్ సెన్సార్ కు రెడీ

సినిమా విడుదల ఇంకా వారం రోజుల దూరంలో వుండగానే పూరిజగన్నాధ్-బాలకృష్ణ కాంబినేషన్ లో ముస్తాబయిన పైసా వసూల్ సినిమా సెన్సార్ కు రెడీ అయిపోయింది. ఈ గురువారం సినిమా సెన్సారు ముందుకు వెళ్తోంది. ఇదిలా వుంటే సెన్సార్ కు ఫుల్లీ ఫినిష్డ్ కాపీని దర్శకుడు పూరి రెడీ చేసారు.

సాధారణంగా సెన్సారుకు కాస్త రఫ్ కాపీ ఇవ్వడం అన్నది జరుగుతు వుంటుంది. కానీ పైసా వసూల్ కు థియేటర్ కు ఏ కాపీ పంపిస్తున్నారో, అదే ఇస్తున్నారు. సెన్సారుకు ఇచ్చేందుకు రెడీ చేసిన కాపీని పూరి, మరి కొందరు యూనిట్ సభ్యులు చూసినట్లు తెలుస్తోంది.

సినిమా ఆద్యంతం హీరో బాలకృష్ణ చుట్టూనే తిరుగుతుంది. అందరూ ఊహించినట్లు సినిమా ముందు నుంచి వెనక్కు వెళ్లి, మళ్లీ ముందుకు వస్తుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎక్కువ వుంటుందన్నమాట. బాలయ్య తేడా సింగ్ గా చాలా అంటే చాలా కొత్తగా కనిపించారని చూసిన వాళ్ల సమాచారం. సినిమా అంతా అయ్యాక, జనాలు తేడాసింగ్ క్యారెక్టర్ ను, ఆ ఏటిడ్యూడ్ తో కనెక్ట్ అవుతారని అంటున్నారు. 

ఇదిలా వుంటే పైసా వసూల్ స్టంపర్, ట్రయిలర్, సాంగ్ మేకింగ్ విడియోలు, అడియో జ్యూక్ బాక్స్ అన్నీ కలిపి యూ ట్యూబ్, ఫేస్ బుక్ ల్లో రెండు కోట్ల వ్యూస్ దాటడం విశేషం. యంగ్ హీరోల సినిమాలతో పోటీ పడుతూ బాలయ్య ఈ ఫీట్ సాధించడం విశేషం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?