Home > Movies - Movie Gossip
పరుచూరి కోరిక రాజమౌళి తీరిస్తే..?

పరుచూరి పలుకులు అంటూ యూ ట్యూబ్ వీక్షకులను పలకరిస్తూ, జ్ఞాపకాలు నెమరవేసుకుంటున్నారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. లేటెస్ట్ గా ఆయన తన సిరీస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన ముచ్చట్లను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా పరుచూరి ఓ కొరికను, ఓ సూచనను కలిపి అందించారు. అదేంటంటే, సూపర్ స్టార్ కృష్ణ ఏ విధంగా అయితే అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించి, ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా మిగుల్చుకున్నారో, మహేష్ బాబు కూడా అలాగే ఛత్రపతి శివాజీ పాత్రలో నటించాలని పరుచూరి కోరారు.

ఛత్రపతి శివాజీ పాత్రలో నటించడం ద్వారా మహేష్ బాబు తన కెరీర్ లో ఓ అత్యుత్తమ పాత్రను పోషించినట్లు, ఓ మంచి చిత్రాన్ని అందించినట్లు అవుతుందని పరుచూరి అభిప్రాయ పడ్డారు.

నిజానికి ఎన్టీఆర్, కృష్ణ ఇద్దరూ శివాజీ పాత్రను పోషించాలనుకున్నారు. కానీ కుదరలేదు. మరి మహేష్ కనుక చేస్తే నిజంగానే సూపర్ గా వుంటుంది. పైగా మహేష్ తో సినిమా చేయాల్సి వున్న దర్శగ దిగ్గజం రాజమౌళి కనుక ఈ సబ్జెక్ట్ తీసుకుంటే ఇక అదరహో.. అదరహ అన్నట్లు వుండదూ.