Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ ఆ సినిమాను పక్కన పెడతారా?

పవన్ ఆ సినిమాను పక్కన పెడతారా?

సర్దార్, గబ్బర్ సింగ్ ఫలితాల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంలో కాస్త గట్టి ఆలోచనే చేస్తున్నట్లు వినికిడి. ప్రస్తుతం ఆయన డైరక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నారు. దీనికి హారిక హాసిని సంస్థ నిర్మాత. కాటమరాయుడు మాదిరిగా బడ్జెట్ లో కాకుండా వంద కోట్ల ఖర్చుతో ప్లాన్ చేస్తున్న సినిమా ఇది. సో దీంతో సమస్య లేదు.

దీని తరువాత ఎ ఎమ్ రత్నం నిర్మాతగా ఓ రీమేక్ ప్లానింగ్ లో వుంది. కానీ ఈ సినిమాను పవన్ కాస్త వెనక్కు నెట్టే ఆలోచనలో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బదులుగా వివి వినాయక్ డైరక్షన్ లో ఓ సినిమా చేసే అవకాశాన్ని పవన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

త్రివిక్రమ్ సినిమాతో సమస్య లేదు. కచ్చితంగా మాంచి బజ్ వచ్చే సినిమా. 99 శాతం బాగుండే అవకాశాలున్న సినిమా. కానీ ఎఎమ్ రత్నం సినిమాకు బడ్జెట్ ఎలా వుంటుందన్నది ఇంకా తెలియదు. రత్నం ఫ్రస్తుతం నిర్మిస్తున్న ఆక్సిజన్ సినిమానే ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు నడుస్తోంది. మరి అలాంటిది పవన్ సినిమా ఎలా నడుస్తుందో తెలియదు. పైగా తమిళ రీమేక్ ల కన్నా, తనకు అన్ని విధాలా సూటయ్యే కథను రెడీ చేయించి, వినాయక్ తో చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందువల్ల రత్నం సినిమాకు ముందుగా దాన్ని తీసుకువచ్చి, వచ్చే సంక్రాంతి లేదా ఫిబ్రవరి నాటికి రెడీ చేయాలని పవన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా నిర్మాణ అవకాశం ఎవరికి దక్కుతుందో?

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?